.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 రసవత్తరంగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో 33వ రోజు బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కొత్త కెప్టెన్ గా సుధీర్ ఎన్నికయ్యాడు. లీడర్ బోర్డులో బాటమ్ లో ఉన్న షాలిని-రోహిత్ (140), ఝాన్సీ-ముకేశ్ (160) జంటలకు బిగ్ బాస్ షాక్ ఇచ్చి ఇద్దరిలో ఒకరు డేంజర్ జోన్ లోకి వెళ్లాలని రూల్ పెట్టాడు. ఝాన్సీ తన మ్యాజిక్ పవర్ ఉందని చెప్పి తానే డేంజర్ జోన్ లోకి వెళ్లగా షాలిని కోసం రోహిత్ త్యాగం చేసి డేంజర్ జోన్ లోకి వెళ్లాడు. దీంతో ముఖేశ్-షాలిని ఒక జట్టుగా మారారు. ఆ తర్వాత ఇచ్చిన "ఫ్లిప్ చెయ్ ఫేస్ చెయ్" టాస్క్ లో నరేష్-రామ్ ప్రసాద్ జోడీ 220 పాయింట్స్ తో టాప్ లో నిలిచినా బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చి వారిలో ఒకరు డేంజర్ జోన్ లోకి వెళ్లాలని చెప్పడంతో నరేష్ డేంజర్ జోన్ లోకి వెళ్లాడు.
దీంతో సేఫ్ జోన్ లో వర్షిణి, అమన్, దేబ్జాని, త్రిగుణ్, సుధీర్, రామ్ ప్రసాద్, వంశీ ఏడుగురు మిగిలారు. ఈ ఏడుగురిలో ఐదుగురికి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ ఛాన్స్ ఉందని, ఇద్దరు తప్పుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో పెద్ద రచ్చ జరిగింది. ముందుగా అమన్, త్రిగుణ్ మధ్య ఒప్పందం ప్రకారం త్రిగుణ్ కెప్టెన్సీకి వెళ్లాల్సి ఉండగా, రోహిత్ ప్రేరేపణతో అమన్ మాట తప్పి తానే పోటీకి దిగాడు. దీంతో త్రిగుణ్, అమన్ మధ్య గొడవ, షాలిని, వర్షిణి, అమన్ మధ్య వాగ్వాదం జరిగింది. రోహిత్ కావాలనే గేమ్ లో చిచ్చు పెడుతున్నాడని పప్పెట్ లాగా అమన్ ని ఆడిస్తున్నాడని హౌస్ లో టాక్ వినిపించింది.
చివరికి జరిగిన ఫైనల్ కెప్టెన్సీ పోరులో అన్ని అడ్డంకులను దాటుకుని సుధీర్ విజయం సాధించి హౌస్ కొత్త కెప్టెన్ అయ్యాడు. దీంతో అగ్నిపరీక్ష బ్యాచ్ కి చెందిన రోహిత్, ఝాన్సీ డేంజర్ జోన్ లోకి వెళ్లడంతో వారి ఫేసులు మాడిపోయాయి. సుధీర్ కెప్టెన్ అవ్వడం అతని గేమ్ కి పెద్ద బూస్ట్ అయితే రేపటి నామినేషన్స్ లో అతను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు. డేంజర్ జోన్ లో ఉన్నవారిని నేరుగా నామినేట్ చేస్తాడా అనేది ఆసక్తిగా మారింది.






