Home

»

Tv News

BiggBoss 10 Telugu: ఎల్లో నుంచి గ్రీన్ కు రేస్.. నరేశ్ స్మార్ట్ గేమ్!

Oct 24, 2026 10:04AM

బిగ్ బాస్ తెలుగు 10 ఏడో వారంలో మరింత ఉత్కంఠగా మారింది. హౌస్ ను రెడ్, ఎల్లో, గ్రీన్ లెవెల్స్ గా విభజించడంతో ఆట తారాస్థాయికి చేరింది. రెడ్ లెవెల్ కంటెస్టెంట్లు మిడ్-వీక్ ఎలిమినేషన్ కు గురవుతుండగా, గ్రీన్ జోన్ లోకి వెళ్తే వచ్చే వారానికి ఇమ్యూనిటీ లభిస్తుందని తెలియడంతో ఎల్లో జోన్ లో ఉన్నవారు గ్రీన్ లోకి వెళ్లేందుకు టాస్క్ లు ఆడుతున్నారు. 

ఈ క్రమంలో ఎల్లో నుంచి గ్రీన్ కు వెళ్లేందుకు బిగ్ బాస్ పలు కంటెంట్ టాస్క్ లు పెట్టాడు. అందులోనే.. తడిసిన కేజీ పత్తి బరువు ఎక్కువ ఉంటుందా, ఎండిన కేజీ పత్తి బరువు ఎక్కువ ఉంటుందా అనే ఆసక్తికరమైన ప్రశ్న వచ్చింది. దీనికి ముఖేష్ గౌడ పరిగెత్తుకుంటూ వచ్చి తడిసిన పత్తి బరువుగా ఉంటుందని తప్పుడు సమాధానం చెప్పి బోల్తా పడ్డాడు. వెంటనే నరేష్ స్పందించి‌‌.. రెండూ ఒకే బరువు ఉంటాయి.. కేజీ అంటే కేజీయే" అని సరైన సమాధానం చెప్పి బోణీ కొట్టాడు. అతని చమత్కార సమాధానానికి హౌస్ లో నవ్వులు పూశాయి. ఈ ప్రశ్నతోనే గ్రీన్ జోన్ రేస్ లో నరేష్ ముందంజ వేశాడు. ఆ తర్వాత డైనోసార్ బొమ్మను చూపించి అడిగిన ప్రశ్న, దోమ సౌండ్ రౌండ్, ఓజీ సినిమా టైటిల్ గుర్తింపు..

ఒక్కో లెవెల్ లో ఒక్కొక్కరు ఈ టాస్క్ లో బాగా అగ్గిపుల్ల గీసే సౌండ్ రౌండ్ లాంటి వివిధ రౌండ్లలో కంటెస్టెంట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. సరదా వాతావరణం నడుమ టాస్క్ లు సాగినా, గ్రీన్ జోన్ రేస్ తో హౌస్ లో టెన్షన్ కూడా మొదలైంది.. ఇదే తర్వాత గొడవలకు దారి తీసింది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com