.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 హౌస్‌లో నామినేషన్స్ ముందు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ విషయంలో ముఖేష్ పెద్ద రచ్చే లేపాడు. తన మాజీ ఫ్రెండ్ దేబ్జానీతో సహా చాలా మంది కంటెస్టెంట్స్ తో ఫుడ్ విషయంలో గొడవ పెట్టుకున్నాడు. శివ్ చాలా పొలైట్ గా తన అభిప్రాయం చెప్పినా, ముఖేష్ అతనితో అరోగెంట్ గా మాట్లాడాడు. ఈ బిహేవియర్ తో హౌస్ లో ముఖేష్ పై మరోసారి నెగెటివిటీ పెరిగింది. టాస్క్ లలో స్ట్రాంగ్ గా ఉన్నా, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో గొడవలు పెట్టుకోవడం ఆడియన్స్ కి నచ్చడం లేదు.
ఇంట్రెస్టింగ్ గా ముఖేష్ కి రోహిత్ తో పెరుగుతున్న ఫ్రెండ్ షిప్ హౌస్ లో ఈక్వేషన్స్ ని పూర్తిగా మార్చేస్తోంది. గతంలో ముఖేష్ కి దేబ్జానీ క్లోజ్ ఫ్రెండ్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఆమెకు దూరమవుతున్నాడు. అటు రోహిత్ కూడా గతంలో తనకు బయట ఇన్ఫర్మేషన్ ఇచ్చి, తన పొజిషన్ రిస్క్ చేసి సపోర్ట్ చేసిన నీతూని ఇప్పుడు ఇగ్నోర్ చేయడం మొదలుపెట్టాడు. ఈ మారుతున్న ఫ్రెండ్ షిప్స్ తో హౌస్ మేట్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అతను రోహిత్ తో కలవడం అలయన్స్ కి బిగ్ షాక్ అవబోతుంది.
బిగ్ బాస్ లో ఫ్రెండ్ షిప్స్ ఎంత వరకు ఉంటాయనే తెలియదు. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే, బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చాడు. G.O.A.T విన్నర్స్ మాత్రమే G.O.A.T టైటిల్ రాని వారిని నామినేట్ చేయాలని చెప్పాడు. గార్డెన్ ఏరియాలో ఇద్దరికి సంబంధించిన ఎక్స్ ట్రా నామినేషన్ స్లిప్స్ మిగిలాయి. మిగతా G.O.A.T విన్నర్స్ అందరూ ఎక్కువ మందిని నామినేట్ చేసి నెగెటివిటీ తెచ్చుకోవడం ఇష్టం లేక సైలెంట్ గా ఉంటే, త్రిగుణ్ మాత్రం ముందుకు వచ్చి మిగిలిన రెండు స్లిప్స్ ని కూడా తనే తీసుకున్నాడు. దీంతో త్రిగుణ్ ఒక్కడే మూడు నామినేషన్స్ చేశాడు. రోహిత్, రామ్ ప్రసాద్ తో పాటు వర్షిణిని కూడా నామినేట్ చేసి అందరిని షాక్ కి గురిచేశాడు. దేబ్జానీని ముఖేశ్ నామినేషన్ చేయడం అందరిని షాక్ కి గురిచేసింది. అయితే ఈ నామినేషన్ పాయింట్ పెద్దగా వ్యాలిడ్ లేదు. అది ముఖేష్ కి మైనస్. దేబ్జానీకి ప్లస్ అవ్వనుంది. ఈ మారుతున్న అలయన్స్ లు, ఈక్వేషన్స్ ఓటింగ్ పై ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి మరి.





.webp)
