.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10లో ఐదో వారం నామినేషన్స్ కేవలం నామినేషన్స్ గానే కాకుండా పర్సనల్ గొడవలకు వేదికగా మారాయి. కంటెస్టెంట్లు పాత విషయాలను తవ్వి మరీ నామినేట్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా రామ్ ప్రసాద్, త్రిగుణ్, రోహిత్ ల మధ్య జరిగిన వాగ్వాదం హౌస్ లో హాట్ టాపిక్ అయింది. రామ్ ప్రసాద్ నామినేషన్ లో రోహిత్ పై త్రిగుణ్ చేసిన కామెంట్స్ ను తప్పుబట్టాడు. దీంతో త్రిగుణ్ వెంటనే తగ్గి రోహిత్ కు క్షమాపణ చెప్పే ప్రయత్నం చేశాడు.
అయితే రోహిత్ మాత్రం త్రిగుణ్ సారీని యాక్సెప్ట్ చేయలేదు. తాను క్షమించనని తెగేసి చెప్పాడు. దీంతో హౌస్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం పెద్ద గొడవలా మారింది. ఇదిలా ఉంటే ముకేశ్, అపూర్వల మధ్య కూడా గట్టి వాగ్వాదం జరిగింది. ముఖేశ్ అపూర్వను నామినేట్ చేస్తూ కెప్టెన్సీలో నీ తీరు నచ్చలేదని అన్నాడు. దీనికి అపూర్వ కౌంటర్ ఇస్తూ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, చిన్నదో వైపు పెద్దదో వైపు అంటూ మాట్లాడడం పద్ధతి కాదని ఫైర్ అయింది.
మరోవైపు అమన్ కూడా ముఖేశ్ ను నామినేట్ చేశాడు. ఒకరిని మోటివేట్ చేయడానికి మరొకరిని కించపరచడం కరెక్ట్ కాదని, బచ్చాగాడు అంటూ మాట్లాడావని కారణం చెప్పాడు. వర్షిణి అపూర్వను నామినేట్ చేస్తూ వైల్డ్ కార్డుగా వచ్చి పోస్ట్ కార్డులా పని చేస్తున్నావని ఘాటు వ్యాఖ్యలు చేసింది. షాలినీ త్రిగుణ్ ను నామినేట్ చేస్తూ మాటలు జారుతుంటారని, డామినేషన్ చేస్తారని ఆరోపించింది. దీంతో హౌస్ లో ఎవరికి వారు తమ గ్రూప్ లను కాపాడుకునే ప్రయత్నం చేశారు.
మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో ఫ్రెండ్ షిప్ లు, గ్రూప్ గేమ్స్ అన్నీ బయటపడ్డాయి. నామినేషన్స్ ఇంకా పూర్తవలేదు . అయితే ఎపిసోడ్ ముగిసినా హౌస్ లో గొడవలు ఆగలేదు. రేపటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో రోహిత్, సుధీర్ ల మధ్య పెద్ద గొడవ జరిగినట్లు చూపించారు. రెండు కంటెంట్ లు కావాలని వచ్చి ఒకదాంట్లో రావద్దంటూ ఇద్దరూ వాదించుకోవడం కనిపించింది. దీంతో ఐదో వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారా అని ఆడియన్స్ లో ఉత్కంఠ మొదలైంది






