Home

»

Tv News

టాస్క్ లో నరేశ్, రామ్ ప్రసాద్ టాప్.. లీడర్ బోర్డ్ లిస్ట్ ఇదే!

Oct 9, 2026 10:27AM

బిగ్ బాస్ సీజన్-10 అయిదో వారం టాస్క్ లతో కంటెస్టెంట్స్ ని ఆడుకుంటున్నాడు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో.. వర్షిణి త్రిగుణ్ తో కూర్చొని తను ఒంటరిగా ఉన్నానని, తనకి ఒక సపోర్ట్ ఉండాలని, ముఖేశ్ నన్ను అర్థం చేసుకున్నాడు.. అంతే కానీ మా మధ్య ఈ ట్రాక్, లవ్ లాంటివేం లేవని చెప్పుకుంటూ ఎమోషనల్ అయింది.  ఇక కిచెన్ దగ్గర దేబ్జానీతో చరణ్ ఫ్లర్ట్ చేయగా..అపూర్వ ఆడుతున్న డబల్ గేమ్ గురించి రోహిత్ దగ్గర చెప్పాడు త్రిగుణ్. ఆ తర్వాత రీలోడ్ లో లీడర్ బోర్డులో పైకి వెళ్లేందుకు టాస్కులు కంటిన్యూ అయ్యాయి.

ఇందులో భాగంగా బిగ్ బాస్ బాల్స్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో షాలిని, అపూర్వ, రామ్ ప్రసాద్, ముఖేశ్, అమన్ లు ఆడగా అమన్ ఫస్ట్, ఆ తర్వాత రామ్ ప్రసాద్, ముఖేశ్, షాలిని, అపూర్వ పూర్తి చేశారు. ఈ టాస్క్ లో టాప్ లో ఉన్న అమన్-త్రిగున్ జంట నామినేషన్స్ నుంచి సేఫ్ అయింది.

టాస్క్ తర్వాత హౌస్ లో డ్రామా మొదలైంది. రోహిత్ అపూర్వతో మాట్లాడుతుండగా షాలిని వచ్చి గొడవ పడింది. ఆ తర్వాత బిగ్ బాస్ సాంగ్స్ వేయడంతో కంటెస్టెంట్స్ స్విమ్మింగ్ పూల్ లో డ్యాన్స్ చేశారు. ఈ క్రమంలో వర్షిణి-ముఖేశ్ స్విమ్మింగ్ పూల్ లో రొమాన్స్ చేయడం, షాలిని-రోహిత్ హగ్ హైలైట్ గా నిలిచాయి. ఆ తర్వాత 'చిత్రం భళారే విచిత్రం' టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో సంఛాలక్ చెప్పిన బొమ్మను ఒకరు గీస్తే మరొకరు స్టోర్ రూమ్ నుంచి ఆ వస్తువును తీసుకురావాలి. వర్షిణి, త్రిగుణ్, అమన్ సంఛాలక్ లుగా వ్యవహరించారు. ఈ టాస్క్ లో నరేష్-రామ్ ప్రసాద్ టాప్ లో ఉండగా.. చివర్లో ముఖేశ్-ఝాన్సీ ఉన్నారు. పాయింట్స్ పట్టికలో కూడా నరేష్-రామ్ ప్రసాద్ టాప్ లో ఉన్నారు.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com