
బిగ్ బాస్ సీజన్-10 తెలుగులో ఏడో వారంలో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఆడియన్స్ ఓటింగ్ లో బాటమ్ లో ఉన్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దక్షి గుత్తికొండ ఎలిమినేట్ అయింది.
వైల్డ్ కార్డ్ గా అయిదవ వారంలో ఎంటర్ అయిన దక్షి.. రెండు వారాల్లోనే తన మార్క్ చూపించలేకపోయింది. ఫిజికల్ టాస్క్ లలో డల్ గా ఉండడం, స్ట్రాటజీలు వర్క్ అవ్వకపోవడం, ఆడియన్స్ తో కనెక్ట్ అవ్వకపోవడంతో ఓటింగ్ లో లాస్ట్ లో నిలిచింది.
దక్షి వైల్డ్ కార్డ్ కావడంతో ఆమెకు కూడా వారానికి లక్ష దాకా ఇచ్చారని తెలుస్తోంది. అంటే రెండు వారాలని గాను తను రెండు లక్షల వరకు రెమ్యునరెషన్ తీసుకుంది. దక్షి ఉన్న రెండు వారాలలో మూడు లేదా నాలుగు సీన్స్ లో మాత్రమే హైలైట్ అయింది. ఇంకెక్కడా కనపడలేదు దక్షి. అందుకే తనకి ఓట్ బ్యాకింగ్ లేకుండా తక్కువ ఓట్లతో రెండు వారాలకే ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ సీజన్-10 లో ఆమె జర్నీ ముగిసింది.





.webp)
