Home

»

Tv News

Bigg Boss 10 Telugu : బజ్ ఇంటర్వ్యూలో శివాజీ ప్రశ్నలకు కన్నీళ్ళు పెట్టుకున్న షాలిని!

Oct 26, 2026 9:42AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 ఏడో వారంలో డబుల్ ఎలిమినేషన్‌ జరిగింది. బయట బజ్‌లో మాత్రం శివాజీ అడిగిన ప్రశ్నలకి షాలిని ఉక్కిరిబిక్కిరి అయింది. హౌస్‌లోకి కామనర్‌గా వచ్చి, సీక్రెట్ రూమ్ ట్విస్ట్‌తో రెండో ఛాన్స్ తెచ్చుకుని కూడా గేమ్ మార్చుకోలేక ఎలిమినేట్ అయిన షాలిని, నేరుగా బిగ్ బాస్ బజ్‌కు వచ్చింది.

హోస్ట్ గా ఉన్న బిగ్ బాస్ ఫేమ్ శివాజీ తన ప్రశ్నలతో షాలినిని అస్సలు వదిలిపెట్టలేదు. ఏకంగా 28 ప్రశ్నలతో ఆమెని ఇబ్బంది పెట్టాడు. లవ్ ట్రాక్ తప్ప నీకు ఇంకేం తెలుసంటూ సూటిగా ప్రశ్నించడంతో షాలిని సమాధానం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకుంది. శివాజీ మొదలుపెట్టిన ప్రశ్నలతో షాలిని చేసిన ప్రతీ తప్పు బయటకు వచ్చింది. రోహిత్‌తో లవ్ ట్రాక్ కోసమే గేమ్‌ను పక్కన పెట్టావా.. టాస్క్‌లలో ఎందుకు డల్‌గా ఉన్నావ్.. హౌస్‌లో అందరితో గొడవలు ఎందుకు పెట్టుకున్నావ్.. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చాక కూడా ఎందుకు మారలేదంటూ వరుస ప్రశ్నలు వేశాడు. నువ్వు హౌస్‌లో ఉంటే రోహిత్ గేమ్ కూడా స్పాయిల్ అవుతోందని ఆడియన్స్ అంతా అనుకుంటున్నారని, నీ వల్లే రోహిత్ బ్యాగేజీలా మారాడని శివాజీ ప్రశ్నలు సంధించాడు. దీనికి షాలినీకి ఏం చెప్పాలో తెలియలేదు.

తనది నిజమైన ఫీలింగ్ అని, గేమ్ కోసం చేయలేదని చెప్పే ప్రయత్నం చేసినా శివాజీ ఒప్పుకోలేదు. ఈ ఇంటర్వ్యూలో శివాజీ ఒకే ఒక్క విషయంపై కాకుండా, షాలిని ఏడు వారాల జర్నీని మొత్తం చూపించాడు. ముఖ్యంగా ముఖేష్, వర్షిణి, ఝాన్సీ లాంటి వాళ్లతో ఆమె ప్రవర్తించిన తీరును వివరించాడు. నాగార్జున స్టేజ్ మీద ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా ఎందుకు మారలేదు.. క్షమాపణ చెప్పడం తప్ప ప్రవర్తనలో మార్పు ఎందుకు చూపించలేదంటూ శివాజీ నిలదీశాడు. దాంతో షాలిని ఎమోషనల్ అయింది. చివరికి తన వల్ల రోహిత్ గేమ్ దెబ్బతిన్నదని ఒప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి షాలిని జర్నీ ఇక్కడితో ముగిసింది. ఆడియన్స్ ఓటింగ్‌లో దక్షి ఎలిమినేట్ అయితే, ఇంటి సభ్యుల ఓటింగ్‌తో రెడ్ జోన్‌లో ఉన్న షాలిని బయటకు వచ్చింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com