Home

»

Tv News

Bgg Boss Telugu 10: బిగ్ బాస్ సీజన్-10 బయాస్ గా ఉందని ఆరోపించిన అపూర్వ!

Oct 17, 2026 8:37AM

 బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నుండి వైల్డ్ కార్డ్ గా వచ్చి అయిదవ వారంలో ఎలిమినేట్ అయి బయటకొచ్చింది అపూర్వ.  వచ్చీ రాగానే షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనను హౌస్ లో అవమానించారని, పేర్లు పెట్టి పిలిచారని, అసభ్యకరమైన కామెంట్లు చేశారని ఆరోపించింది. ముఖ్యంగా ముఖేష్ తనను డిస్ రెస్పెక్ట్ చేశాడని అపూర్వ డైరెక్ట్ గా పేరు పెట్టి ఆరోపించింది. అలాగే షో మేకర్స్ పై కూడా సీరియస్ కామెంట్స్ చేసింది. హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్లను ఫేవర్ చేస్తున్నారని, మరికొందరిని అన్యాయంగా ట్రీట్ చేస్తున్నారని, బయాస్ గా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అపూర్వ మూడవ వారంలో మిథిలేష్ తో కలిసి వైల్డ్ కార్డ్ గా హౌస్ లోకి వచ్చింది. మిథిలేష్ రూ.15 లక్షల సూట్ కేస్ తీసుకుని వెళ్లిపోగా.. అపూర్వ మాత్రం కెప్టెన్సీ కూడా తెచ్చుకుని గేమ్ ఆడే ప్రయత్నం చేసింది. కానీ చిన్న చిన్న విషయాలకే గొడవలు పడటం, ఓవర్ యాక్షన్ చేయడం వల్ల నెగిటివిటీ వచ్చిందని, దీంతో 5వ వారంలో డబుల్ ఎలిమినేషన్ లో చరణ్ తో పాటు ఆమె ఎలిమినేట్ అయింది. బయటకు వచ్చాక ఆమె చేస్తున్న కామెంట్లు ఇప్పుడు బిగ్ బాస్ 10 పై మరో వివాదానికి తెరలేపాయి.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్నిరోజులు గొడవలతో ఫుల్ అరవడం.. బ్యాక్ బచ్చింగ్ చేసిన  అపూర్వ.. ఇంత తొందరగా బయటకొస్తుందని ఎవరు అనుకోలేదు. అందుకేనేమో బయటకొచ్చాక ఇలా ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తోంది. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com