Home

»

Tv News

Bigg Boss 10 Telugu: ఏడో వారం సస్పెన్స్ ఎగ్జిట్..ట్విస్ట్ తో దక్షి ఎలిమినేషన్!

Oct 26, 2026 10:05AM

బిగ్ బాస్ సీజన్-10 ఏడో వారం ట్విస్ట్ లతో ముగిసింది. కంటెస్టెంట్స్ మధ్య ఎలిమినేషన్ రౌండ్ ఫుల్ సస్పెన్స్ తో సాగింది. మొదటగా ఆడియన్స్ ఓటింగ్ ద్వారా దక్షి ఎలిమినేషన్ అయింది. ఆ తర్వాత ఇంటిసభ్యుల ఓటింగ్ తో షాలిని ఎలిమినేట్ అయింది.

నిన్నటి ఎపిసోడ్ లో సండే ఫన్ డే అంటూ గేమ్స్ అండ్ డ్యాన్స్ తో షురూ చేశాడు నాగార్జున. కాసేపటికి ఎల్లో, గ్రీన్ జోన్‌లో ఉన్నా కూడా నామినేషన్స్‌లో ఉండటం వల్ల వర్షిణి, శివ్‌లకు ఆడియన్స్ ఓట్లు వేశారా.. సేఫ్ చేశారా.. లేదా.. అన్నది నాగార్జున తెలిపాడు. ఈ ఇద్దరూ సేఫ్ అయ్యారని నాగార్జున చెప్తాడు. ఆ తర్వాత డాన్యుబ్ ప్రాపర్టీస్ ఓనర్ వస్తాడు. అతడి ప్రయాణం, వ్యాపారం అంటూ ప్రమోషన్స్ చూపిస్తాడు. అతడు బిగ్ బాస్ ఇంటి నుంచి స్టేజ్ మీదకు వెళ్లిన తర్వాత ఫిక్షనరీ టు డిక్షనరీ అని టాస్క్ పెడతాడు నాగార్జున. ఇందులో ఓ సినిమా పేరుని బొమ్మల రూపంలో గీస్తూ హింట్స్ ఇస్తుంటే.. అవతల ఉన్న వారు గెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆటలో సుధీర్ టీమ్ గెలుస్తుంది. ఆర్కే టీమ్ ఓడిపోతుంది. త్రిగుణ్, రామ్ ప్రసాద్, ముఖేష్ ఝాన్సీ ఇలా ఈ ఆటలో పాయింట్స్ తేలేకపోతారు. ఈ ఆట తర్వాత డాన్యుబ్ ప్రమోషన్ ముగుస్తుంది. 

ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న అందరిని గార్డెన్ ఏరియాలోకి పిలుస్తాడు నాగార్జున. ‌వారి పేర్ల ముందున్న ఒక బాక్స్ ముందు అందరు నిల్చుంటారు. ఎవరి బాక్స్ నుండి అయితే బ్లాక్ కలర్ పేపర్ కట్స్ వస్తాయో వారే ఎలిమినేషన్ అనగా అందరి బాక్స్ ల నుండి రెడ్ కలర్ పేపర్స్ వస్తాయి కానీ దక్షి ముందున్న బాక్స్ నుండి మాత్రం బ్లాక్ కలర్ పేపర్స్ రావడంతో తను ఎలిమినేషన్ అవుతుంది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com