Home

»

Tv News

Bigg Boss 10 Telugu Shiva Kumar: త్రిగుణ్ చేతిలో ఓడిన శివ్ కుమార్.. అతనికి పనిష్మెంట్ గా ఆ డ్యూటీ!

Oct 12, 2026 6:46PM

బిగ్ బాస్ 10 తెలుగులో ఫస్ట్ వైల్డ్ కార్డ్ గా సీరియల్ యాక్టర్ శివ కుమార్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే వచ్చీ రాగానే ఓడిపోయి వాష్ రూం డ్యూటీ తీసుకున్నాడు.

స్టేజ్ మీదకు వచ్చిన శివ్ తన కాబోయే భార్య, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి మాట్లాడాడు. తన టార్గెట్ లు ఎవరని నాగార్జున అడుగుతాడు. దాంతో షాలినీ, చరణ్ అని శివ్ చెప్పాడు. షాలినీ బిగ్ బాస్ కప్ కోసం కాకుండా రోహిత్ కోసం వచ్చినట్టు ఉందని కామెంట్ చేశాడు. దీనికి షాలినీ రివర్స్ కౌంటర్ వేయబోతే నాగార్జుననే షాలినీకి కౌంటర్ ఇచ్చాడు. చరణ్ లక్కీ కానీ ఆడటం లేదని, అగ్నిపరీక్షలో ప్రియాంకకు బాగా ప్రపోజ్ చేసి తన ఫ్యాన్ అయ్యావని కానీ ఫ్యాన్స్ ని నిరుత్సాహపరిచావని చరణ్ కి చెప్పాడు. ఇంట్లోకి వెళ్లే ముందు శివ్ కి రూ.2 లక్షల బ్రీఫ్ కేస్ ఇచ్చాడు నాగార్జున. డేంజర్ జోన్ లో ఉన్న వారిలో అర్హత ఉన్న ఇద్దరికి సేఫ్టీ బ్యాడ్జెస్ పెట్టాలని, అలాగే మ్యాజికల్ పవర్ ఉన్న వారిని ఛాలెంజ్ చేసి టాస్క్ ఆడాలని చెప్పాడు. గెలిస్తే పవర్ వస్తుంది. ఓడితే 2 లక్షలు ప్రైజ్ మనీకి యాడ్ అవుతాయని రూల్ చెప్పాడు.

ఇంట్లోకి వెళ్లిన శివ్.. నరేష్, ముఖేష్ లకు సేఫ్టీ బ్యాడ్జెస్ ఇచ్చాడు. త్రిగుణ్ పవర్ ఇంట్రెస్టింగ్ గా ఉందని అతనితోనే పిరమిడ్ టాస్క్ లో పోటీ పడ్డాడు, రోహిత్ సంఛాలక్ గా ఉన్నాడు. ఈ టాస్క్ లో త్రిగుణ్ గెలిచాడు. దీంతో అతని మ్యాజికల్ పవర్ అతని దగ్గరే ఉండిపోయింది. 2 లక్షలు ప్రైజ్ మనీకి యాడ్ అయ్యాయి. ఓడిపోయినందుకు పనిష్మెంట్ గా శివ్ కి వాష్ రూమ్ క్లీనింగ్ డ్యూటీ వేశారు. అయితే తాను ఓడినా ప్రైజ్ మనీకి డబ్బు యాడ్ అవుతుంది, అంటే చివరగా ఆ ప్రైజ్ మనీ కూడా నాదే కదా అంటూ శివ్ కెమెరాకి చెప్పి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com