
బిగ్ బాస్ సీజన్-10 తెలుగులో ఐదో వారం రోడ్ టు రీలోడ్ ముగిసింది. డబుల్ ఎలిమినేషన్ లో అపూర్వ, చరణ్ ఎలిమినేట్ కాగా.. ఐదుగురు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో ప్రైజ్ మనీ పెరిగింది.
ఫిఫ్త్ వీక్ ముగిసే సరికి శివ్, దక్షి, నీతూ, శ్వేతా నాయుడు, రామకృష్ణ ఇలా ఐదుగురు హౌస్ లోకి వచ్చారు. ఇందులో నీతూ మాస్టర్ మాత్రం త్రిగుణ్ మీద గెలిచి మ్యాజికల్ పవర్ లాగేసుకుంది. మిగిలిన నలుగురు ఓజీ కంటెస్టెంట్ల చేతుల్లో ఓడిపోయారు. ఓజీ కంటెస్టెంట్లు గెలిచిన ప్రతీసారి ప్రైజ్ మనీకి రెండు లక్షల చొప్పున యాడ్ అయ్యాయి. మిథిలేష్ పట్టుకెళ్లిన పదిహేను లక్షలు పోగా మిగిలిన 35 లక్షలకు 8 లక్షలు కలిసి ఇప్పుడు ప్రైజ్ మనీ 43 లక్షలు అయింది.నాలుగో వైల్డ్ కార్డ్ గా వచ్చిన శ్వేతా నాయుడు డ్యాన్స్, సింగింగ్, దేబ్జానీ ఇమిటేషన్ తో స్టేజ్ మీద అదరగొట్టింది. రోహిత్ ఇష్టమే కానీ షాలినీ ఇష్టం లేదు.. షాలినీ డేంజరస్, ఎక్కువ లౌడ్ అని అంది. తనకు ఇచ్చిన సేఫ్టీ బ్యాడ్జెస్ ని రోహిత్, నరేష్ లకు ఇచ్చింది. వంశీతో టాస్క్ లో పోటీ పడి ఓడిపోయింది. దీంతో హౌస్ క్లీనింగ్ డ్యూటీ పనిష్మెంట్ గా వచ్చింది.
ఐదో వైల్డ్ కార్డ్ గా అగ్నిపరీక్ష ఫేమ్ రామకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు. రెండు సార్లు ఫైనల్ వరకు వచ్చి మిస్ అయిన రామకృష్ణ మూడో ప్రయత్నంలో హౌస్ లోకి వచ్చాడు. రోహిత్ అగ్నిపరీక్షలో ఉన్న ఫైర్ ఇక్కడ కనిపించడం లేదని.. షాలినీ బిగ్ బాస్ కప్ కోసం కాకుండా రోహిత్ కోసమే వచ్చినట్టు ఉందని అన్నాడు. తన బ్యాడ్జెస్ ని కూడా నరేష్, రోహిత్ లకు ఇచ్చాడు. అయితే రామకృష్ణ ఎంట్రీకి ముందు డేంజర్ జోన్ లో ఉన్న షాలినీ, చరణ్ లలో ఎవరు ఉండాలని ఓజీ కంటెస్టెంట్లను ఓటింగ్ అడిగారు. 11 ఓట్లలో షాలినీకి 10 ఓట్లు, చరణ్ కి అమన్ ఒక్క ఓటు వేయడంతో చరణ్ సెకండ్ టైం ఎలిమినేట్ అయ్యాడు. వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్స్ ఎలా ఆడతారో చూడాలి మరి.






