
బిగ్ బాస్ సీజన్-10 తెలుగు నిన్నటి వీకెండ్ ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో హౌస్ మొత్తం హీటెక్కింది. ఐదుగురు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇవ్వగా, సెకండ్ వైల్డ్ కార్డ్ గా దక్షి గుత్తికొండ ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రాగానే ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించింది దక్షి.
స్టేజ్ మీదకు వచ్చిన దక్షి తన లైఫ్ గురించి చెప్పింది. నాన్న లేకుండా పెరగడం చాలా కష్టం, అమ్మ నాకు ఎలాంటి లోటు తెలియకుండా పెంచిందని ఎమోషనల్ అయింది. ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా గుర్తింపు రాలేదని అంది. తన టార్గెట్ షాలినీ, నరేష్ అని చెప్పింది. రోహిత్ అంటే ఇష్టం, షాలినీ ఇష్టం లేదు.. ఆమె ఆటలు ఆడటం లేదు.. అపూర్వ క్యారెక్టర్ ని చంపేలా మాట్లాడిందని అంది. నరేష్ ఎంటర్టైన్ చేయడం లేదని కూడా చెప్పింది.
ఇంట్లోకి వచ్చిన తర్వాత రోహిత్, ముఖేష్ లకు బ్యాడ్జెస్ పెట్టింది దక్షి. తర్వాత నరేష్ తో మ్యాజిక్ పవర్ టాస్క్ లో పోటీ పడింది. సుధీర్ ని సంఛాలక్ గా ఎంచుకుంది. ఆటలో బాల్స్ తీసి డబ్బాలో వేయాలి. నరేష్ ఫస్ట్ లెవెల్ ని చకచకా ఫినిష్ చేసి, హైట్ ప్రాబ్లం ఉన్నా సెకండ్ లెవెల్ ని కూడా కంప్లీట్ చేసి విన్ అయ్యాడు. టాస్క్ ఆపేయండి అని సుధీర్ చెప్పినా దక్షి నేను ట్రై చేయాలి కదా అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించింది. చివరకు నరేష్ విన్ అవ్వడంతో ప్రైజ్ మనీకి రెండు లక్షలు యాడ్ అయ్యి మొత్తం 39 లక్షలు అయింది. నరేష్ గెలవడంతో దక్షికి పనిష్మెంట్ గా గిన్నెలు కడిగే పని అంటే యుటెన్సిల్స్ క్లీనింగ్ డ్యూటీ వేశాడు.





.webp)
