
బిగ్ బాస్ సీజన్-10 లో మళ్లీ ట్విస్ట్. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అపూర్వ ఓటింగ్ లో లీస్ట్ తో ఫస్ట్ ఎలిమినేట్ అయితే, సెకండ్ ఎలిమినేషన్ ని వైల్డ్ కార్డ్స్ చేతిలో పెట్టాడు నాగార్జున.
లాస్ట్ లో చరణ్, షాలినీ మిగిలారు. వీరిలో ఒకరిని సేవ్ చేయాలని, ఒకరిని ఎలిమినేట్ చేయాలని వైల్డ్ కార్డ్స్ తో పాటు హౌస్ మేట్స్ కి చెప్పారు. 11 ఓట్లలో 10 ఓట్లు షాలినీ సేవ్ అవ్వాలని పడ్డాయి. అమన్ ఒక్కడే చరణ్ ఉండాలని, షాలినీ ఎలిమినేట్ అవ్వాలని ఓటు వేశాడు దీంతో చరణ్ రెండోసారి ఎలిమినేట్ అయ్యాడు.
ఫస్ట్ వీక్ లోనే హౌస్ మేట్స్ ఓటింగ్ తో చరణ్ ఎలిమినేట్ అయ్యాడు. మళ్లీ ఆడియన్స్ ఓట్ల ద్వారా రీ ఎంట్రీ ఇచ్చాడు. కానీ రీ ఎంట్రీ తర్వాత కూడా గేమ్ లో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. వర్షిణి, దేబ్జానీలతో ఫ్లర్ట్ తప్ప కంటెంట్ ఇవ్వలేదని టాక్. అన్ వర్తీ టాస్క్ లో కూడా 4 స్టాంప్ లు పడ్డాయి. మరోవైపు షాలినీకి ఒక్క ఓటే పడటంతో రోహిత్, షాలినీ షాక్ అయ్యారు. అమన్ ని ఎందుకు చరణ్ కి ఓటు వేశావ్ అని రోహిత్ ప్రశ్నిస్తే, అందరూ షాలినీకే వేస్తారని నేను చరణ్ కి వేశాను అని అమన్ చెప్పాడు. చరణ్ ఏం చేశాడని ఓటు వేయాలని అమన్ అనడంతో రోహిత్ హర్ట్ అయినట్టు తెలుస్తోంది.





