(1).webp)
బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ సెప్టెంబర్ మొదటొ వారంలో పదో సీజన్ మొదలు కానుంది. అయితే ఇందులో ఎవరు కంటెస్టెంట్స్ గా ఉంటారనేది అందరిలో ఒక క్యూరియాసిటి నెలకొంది. అయితే గత సీజన్ లో అగ్ని పరీక్ష పెట్టి కొంతమంది కంటెస్టెంట్స్ ని లోపలికి పంపించగా వారు రఫ్పాడించారు. అయితే ఇప్పుడు కూడా అగ్నిపరీక్ష మొదలు కానుంది. మరో రెండు రోజుల్లో అంటే అగస్ట్ 15 నుండి మొదలు కానుంది.
ఇప్పటికే బిగ్ బాస్ టీమ్ వైజాగ్ టూర్ అంటూ అగ్ని పరీక్ష ప్రమోషన్స్ చేశారు. ఇక అగ్నిపరీక్ష సీజన్-2 కి శ్రీముఖి యాంకర్ గా ,అభిజిత్ , బిందు మాధవి, నవదీప్ జడ్జెస్ గా ఉన్నారు. ఇక ఈ అగ్నిపరీక్ష కోసం వేల అప్లికేషన్స్ నుంచి 70 మందిని సెలెక్ట్ చేశారంట. ఇక వీరిలో నుండి ఎవరు హౌస్ లోకి వెళతారనేది బిగ్ బాస్ అగ్ని పరీక్షలో టాస్కులు ఇస్తారు. ఇందులో నుండి టాప్ 15 కంటెస్టెంట్లను ఎంచుకుంటారు. ఆయితే ఇప్పటికే హౌస్ లో కొన్ని టాస్క్ లు జరిగినట్టుగా, కొంతమందిని బిగ్ బాస్ టీమ్ సెలెక్ట్ చేసినట్టుగా నెట్టింట కొన్ని లీక్స్ వచ్చాయి. అయితే అందులో టాప్ 15 కంటెస్టెంట్ల పేర్లు బయటకు వచ్చాయి.
రాజ కుమారి డయానా, షాలిని పటేల్, ఆర్జే చరణ్, మితిలేష్, శ్రష్టి వ్యాకర్ని, అమన్, హేమంత్, నవరసాలు ఆర్కే, భాగి తుల్లూరి, దీపక్, రోహిత్, యాంకర్ ప్రియ, సింగర్ ఝాన్సీ, గాయత్రి, అపూర్వ తదితరులు అంతా కూడా అగ్ని పరీక్షలో టాప్ 15 కంటెస్టెంట్లుగా సెలెక్ట్ అయ్యారని తెలుస్తోంది. ఇక ఇందులోంచి బిగ్ బాస్ పదో సీజన్‌లోకి అడుగు పెట్టే కంటెస్టెంట్లు ఎవరన్నది మాత్రం తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ ప్రారంభం అయ్యే రెండు, మూడు రోజుల ముందే ఈ టాప్ 5 కంటెస్టెంట్లను ఎంచుకుంటారు. అయితే ఇలా అగ్ని పరీక్షలో నుండి కాకుండా కొంతమంది సెలెబ్రిటీలని కూడా బిగ్ బాస్ టీమ్ కలిసినట్టుగా తెలుస్తోంది. అందులో ఆటో రాం ప్రసాద్ అయితే దాదాపు కన్ఫమ్ అయ్యాడని సమాచారం. ఇక కుకు విత్ జాతిరత్నాలు నుంచి యాదమ్మ రాజు, దీపిక రంగరాజు, ఎక్స్ ప్రెస్ హరి, ఆషిక, పల్లవి గౌడ, పల్లవి రామిశెట్టి ఇలా కొంత మంది బిగ్ బాస్ పదో సీజన్‌కి వస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే వీరిలో బిగ్ బాస్ షోకి ఎవరు వస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ప్రతీ సీజన్ లాగే ఈ పదో సీజన్ కూడా సెప్టెంబర్ మొదటి వారంలో మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.




.webp)
