Bigg Boss 9 Telugu Rithu Chowdary : రీతూ అన్ ఫెయిర్ ఎలిమినేషన్.. టాప్-5 లో భరణిని ఉంచేందుకు బిగ్ బాస్ ప్లాన్!
on Dec 8, 2025

బిగ్ బాస్ సీజన్-9 పదమూడో వారం పూర్తయింది. హౌస్ లో ఎనిమిది మంది ఉండగా.. నిన్నటి ఎపిసోడ్ లో రీతూ ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం ఏడుగురు ఉన్నారు. ఫినాలే వీక్ కి ఇంకా టూ వీక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ ఒకరిని ఎలిమినేట్ చేసిన టాప్-5 ఉండరు.. టాప్-6 ఉంటారు. ఒకవేళ టాప్-5 కాకుండా టాప్-6 అంటే మాత్రం వీకెండ్ లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. సంజన, సుమన్, భరణి వాళ్ళతో కంపేర్ చేస్తే రీతూ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఫస్ట్ నుండి టఫ్ ఫైట్ ఇచ్చింది.
భరణి ఎలిమినేట్ అయి బయటకు వచ్చి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ ఇవ్వడానికి అంతగా గేమ్ ఆడలేదు. పైగా ఆడియన్స్ ఓటింగ్ ద్వారానే బయటకు వచ్చాడు కానీ మళ్ళీ రీఎంట్రీ చేసి ఇప్పుడు ఏకంగా అతన్ని టాప్-5 లో ఉంచేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నాడు. సంజన ఎప్పుడో ఎలిమినేట్ అయింది కానీ హౌస్ మేట్స్ ని త్యాగాలు చేపించి మళ్ళీ రప్పించారు. త్యాగం చేసిన రీతూనే బయటకు పంపించారు. నెక్స్ట్ వీక్ లో సంజన, లేదా సుమన్ శెట్టి వీళ్ళలో ఒకరు వీకెండ్ లో ఎలిమినేట్ అవుతారు. ఒకరు మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతారు. ఇక బిగ్ బాస్ ప్లాన్ ప్రకారం భరణి టాప్-5 ఖాయం.
ఇక్కడ రీతూకి అన్యాయం జరిగిందని చెప్పాలి. ఓటింగ్ లో లాస్ట్ లో సుమన్ శెట్టి, సంజన, రీతూ ఉండగా అందులో రీతూ ఎలిమినేట్ అనేది టోటల్లి అన్ ఫెయిర్. ఫ్యామిలీ వీక్ తర్వాత సుమన్ శెట్టి టికెట్ టూ ఫినాలే ఒక్క టాస్క్ లో తప్ప ఎక్కడ కన్పించలేదు. ఫైనల్ గా ఎవరు ఏం అనుకుంటే అది జరగదు.. ఏది అనుకుంటే అది అవుద్దని మరొకసారి ప్రూ చేశాడు బిగ్ బాస్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



