Bigg Boss 9 Telugu: భరణి ఫుల్ ఫైర్.. వెక్కి వెక్కి ఏడ్చిన రీతూ!
on Dec 6, 2025
.webp)
బిగ్ బాస్ సీజన్-9 లో పదమూడో వారం క్లైమాక్స్ కి చేరుకుంది. అంటే వీకెండ్ వచ్చేసింది. ఈ వారం హౌస్ లో నుండి ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటీ ఓ వైపు ఉంటే టాప్-5 ఉంటారా టాప్-6 ఉంటారా అనే క్యూరియాసిటీ మరోవైపు ఉంది.
నిన్నటి వరకు జరిగిన టికెట్ టూ ఫినాలే ఎట్టకేలకు ముగిసింది. కెప్టెన్ కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఓ సారి చూసేద్దాం. రీతూ, భరణి మధ్య గొడవ ముదిరింది. ఇప్పటి వరకు సంఛాలక్ కి గౌరవం ఇచ్చి వదులుకున్నాను.. ఇక వదులుకోను.. రీతూ పెట్టింది ట్రయాంగిల్ కాదు.. నాలుగు భుజాలున్నాయంటూ భరణి రెచ్చిపోయాడు. అయితే సంజన అప్పటికే రీతూని విన్నర్ గా డిక్లేర్ చేసింది. ఇక తన పాయింట్ తో భరణి మళ్ళీ రింగ్ వేసి తన గేమ్ పూర్తిచేశాడు. అయితే అదే సమయంలో రీతూ ఒక రింగ్ ని తన టీ షర్ట్ లో పెట్టుకుంది. ఇది ముమ్మాటికి తప్పే. గేమ్ లో నిజాయితీ లేకుంటే తను గెలిచినా అది ఓడినట్టే. అదే విషయం చెప్తూ భరణి ఫుల్ ఫైర్ అయ్యాడు.
ఇక భరణి, రీతూ మధ్యలో సంఛాలక్ సంజన నలిగిపోయింది. ఎంతలా అంటే రీతూ కంటే ముందు భరణికి తన సపోర్ట్ కానీ అక్కడ ఫస్ట్ గేమ్ ఫినిష్ చేసింది రీతూ. ఇక భరణి తన పాయింట్ మీద కాన్ఫిడెంట్ ఉన్నాడు. రీతూ ఏడుస్తూ లోపలికి వెళ్లింది. బెడ్ పై కూర్చొని ప్రతీసారీ ఇలానే చేస్తారు. నేను గెలవడం ఎవరికీ ఇష్టముండదంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. భరణి అనే వాడు ఎప్పుడు సంఛాలక్ డెసిషన్ కి ఎదురుచెప్పలేదు.. ఈరోజు ఎదురుచెప్తున్నాను అంటే నా వైపు న్యాయం ఉందంటూ సంజన మీద భరణి ఫుల్ ఫైర్ అయ్యాడు. మరి వీకెండ్ లో నాగార్జున దీనిమీద పెద్ద డిబేట్ పెట్టేలా ఉన్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



