
బిగ్ బాస్ సీజన్-10 తెలుగులో ఏడవ వారం డబుల్ ఎలిమినేషన్ తో బిగ్ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు లీక్స్ వస్తున్నాయి. అయితే వీటిల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఐదవ వారంలో హౌస్ లోకి అడుగుపెట్టిన గ్లామర్ బ్యూటీ దక్షి గుట్టికొండ ఎలిమినేట్ అయినట్లు స్ట్రాంగ్ లీక్స్ వస్తున్నాయి. శివ కుమార్, నీతూ మాస్టర్, శ్వేతా నాయుడు, రామకృష్ణలతో పాటు హౌస్ లోకి వచ్చిన దక్షి కేవలం రెండు వారాల్లోనే ఇంటి నుంచి బయటకు వచ్చేస్తోందని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఆడియన్స్ నుంచి తగినంత సపోర్ట్ తెచ్చుకోలేకపోవడం, కంటెంట్ ఇవ్వడంలో ఫెయిల్ అవ్వడమే ఆమె ఎలిమినేషన్ కు కారణంగా తెలుస్తోంది.
ఓటింగ్ లో అట్టడుగున ఉన్న శ్వేతా నాయుడు, నీతూ, దక్షి, శివ కుమార్ డేంజర్ జోన్ లోకి వెళ్లగా, నీతూ మాస్టర్ టాస్క్ లలో గెలిచి ఇమ్యూనిటీ తెచ్చుకుంది. శుక్రవారం వరకు వచ్చిన అనధికారిక ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం దక్షికి అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేషన్ దాదాపుగా ఖాయమైంది. క్రేజీ కంటెస్టెంట్, గ్లామర్ డాల్ గా వచ్చిన దక్షి హౌస్ లో తన మార్క్ వేయలేకపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో దక్షితో పాటు షాలిని కూడా రియల్ ఎలిమినేషన్ అయినట్లు బిగ్ బాస్ లీక్స్ లో తెలుస్తోంది.
గత వారం సీక్రెట్ రూమ్ ట్విస్ట్ తో సేవ్ అయిన షాలిని.. ఈ వారం నిజంగానే బయటకు వచ్చేసింది. వీరిద్దరి ఎలిమినేషన్ పై హోస్ట్ నాగార్జున ఆదివారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో క్లారిటీ ఇవ్వనున్నారు. దక్షి ఎలిమినేషన్ తో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు షాక్ తగిలినట్లయింది. అయితే షాలిని ఎలిమినేషన్ మాత్రం రోహిత్ అండ్ అమన్ వాళ్ళకి బిగ్ షాక్ . మరి వీరిద్దరి డబుల్ ఎలిమినేషన్ నిజమేనా కాదా తెలియాలంటే ఆదివారం రాత్రి ఎపిసోడ్ పూర్తిగా చూడాల్సిందే.
[Bigg Boss 10 Week 7 Double Elimination, Bigg Boss Dakshi Elimination, Bigg Boss Shalini Elimination, Dakshi Guttikonda Elimination, Bigg Boss Dakshi, Bigg Boss Shalini, Akkineni Nagarjuna]






