Home

»

Tv News

నాలుగో వారం ఓటింగ్ లో సంచలనం.. టాప్ లో త్రిగుణ్ దూకుడు, డేంజర్ జోన్ లో నరేష్, దెబ్జానీ!

Oct 3, 2026 10:29AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నాలుగో వారం ఓటింగ్ క్లోజ్ అయ్యింది. ఈ వారం నామినేషన్ లో 9 మంది ఉన్నారు. ఓటింగ్ రిజల్ట్ చూస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ దాదాపు 50 శాతం ఓట్లతో టాప్ లో దూసుకుపోతుంటే, ఇద్దరు కంటెస్టెంట్లు బాటమ్ లో కొట్టుకుంటున్నారు.

ఈ వారం ఓటింగ్ లో త్రిగుణ్ కి తిరుగు లేదు. 48.62% (1,90,241 ఓట్లు) తో నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నాడు త్రిగుణ్. రోహిత్ తో గొడవ, హౌస్ లో స్ట్రాంగ్ గా ఆడుతున్న తీరు అతనికి బాగా కలిసొచ్చింది.సెకండ్ ప్లేస్ లో రోహిత్ ఉన్నాడు. 14.46% (56,563 ఓట్లు) తో రోహిత్ సేఫ్ జోన్ లో ఉన్నాడు. త్రిగుణ్ తర్వాత ఎక్కువ ఓట్లు తెచ్చుకుంది రోహితే. థర్డ్ ప్లేస్ లో ముఖేష్ 7.59% (29,690 ఓట్లు), ఫోర్త్ ప్లేస్ లో షాలిని 6.05% (23,653 ఓట్లు)తో ఉన్నారు.

ఈ వారం ఎలిమినేషన్ రేస్ లో బాటమ్ లో ముగ్గురు ఉన్నారు. శ్రిస్టి - 4.66% (18,242 ఓట్లు), అమన్ - 4.29% (16,782 ఓట్లు), దెబ్జానీ - 4.18% (16,338 ఓట్లు), నరేష్ - 4.17% (16,327 ఓట్లు) . అందులోనూ లాస్ట్ రెండు ప్లేస్ లో దెబ్జానీ, నరేష్ ఉన్నారు. ఇద్దరి మధ్య కేవలం 11 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఈ ఇద్దరూ వెళ్లిపోవడం పక్కా. సింగిల్ ఎలిమినేషన్ అయితే నరేష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.చరణ్ 5.98% (23,411 ఓట్లు) తో మిడిల్ లో ఉన్నాడు. మొత్తంగా చూస్తే త్రిగుణ్ కి ఉన్న క్రేజ్ వేరే లెవెల్ లో ఉందని ఈ ఓటింగ్ తో అర్థమవుతోంది. మరి ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లేది నరేష్ ఆ? దెబ్జానీ ఆ? అనేది వీకెండ్ లో తేలనుంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com