.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లేటెస్ట్ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్ లు.బిగ్ బాస్ ప్రకటించిన అల్టిమేట్ గోట్ టాస్క్ లో గతంలో గోట్ టైటిల్ గెలిచిన వారికి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఈ టాస్క్ గెలిచిన వారు ఈ వారం కెప్టెన్ అవడంతో పాటు సీజన్ మొత్తం కెప్టెన్సీ రేసులో నేరుగా పాల్గొనే బంపర్ ఆఫర్ ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు.
నిన్న జరిగిన అల్టిమేట్ గోట్ కెప్టెన్సీ టాస్క్ లో రోహిత్ సంచాలక్ గా వ్యవహరించాడు. ఈ టాస్క్ లో త్రిగుణ్, ముకేశ్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. చివరకు అమన్, శివ, వంశీ సపోర్ట్ తో త్రిగుణ్ విజయం సాధించి అల్టిమేట్ గోట్ గా ఈ వారం కెప్టెన్ గా నిలిచాడు. గెలిచిన త్రిగుణ్ విన్నర్స్ హంబుల్ గా ఉండాలంటూ వినయంగా మాట్లాడాడు. కానీ ఓడిన ముకేష్ మాత్రం కిచెన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ముఖేష్ దగ్గరికి త్రిగుణ్ వచ్చి సారీ చెప్పి బ్రతిమాలిమలనా సెలబ్రేషన్స్ లోకి రాలేదు.
ఇక కాసేపటికి బిగ్ బాస్ అందరిని హాల్లోకి పిలిచాడు. ఈ రోజు సడన్ ఎలిమినేషన్ ఉంటుంది.. రెడ్ జోన్ లో ఉన్నవాళ్ళు బ్యాగ్స్ ప్యాక్ చేస్కోండి అని బిగ్ బాస్ చెప్పడంతో అందరు షాక్ అయ్యారు. రెడ్ జోన్ లో ఉన్న సుధీర్, రోహిత్, ఝాన్సీ, రామకృష్ణ, శ్వేత లలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని గ్రీన్ టీమ్ కి చెప్పారు. గ్రీన్ టీమ్ ఓటింగ్ లో రోహిత్ కి 3, రామకృష్ణకి 3, సుధీర్ కి 1 ఓటు వచ్చి టై అయింది. అయితే బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి హౌస్ మేట్స్ ఓట్లను కాదని, ఆడియన్స్ ఓటింగ్ లో అతి తక్కువ ఓట్లు ఉన్న సుధీర్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించాడు. సుధీర్ ఎమోషనల్ గా తన బెడ్ ని, తన ఫ్రెండ్షిప్ గ్రూప్ లో తన ప్లేస్ ని రోహిత్ కి ఇచ్చి వెళ్ళిపోతుండగా...అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. ముకేష్ తన దగ్గర ఉన్న స్పెషల్ రిజరెక్షన్ మ్యాజిక్ పవర్ ని యూజ్ చేయడానికి పర్మిషన్ అడిగాడు. ఆ పవర్ తో ఝాన్సీ దగ్గర గతంలో ఉన్న ఎలిమినేషన్ ఫ్రీ పాస్ ని తిరిగి తెప్పించాడు. వెంటనే ఝాన్సీ ఆ పవర్ ని సుధీర్ ని సేవ్ చేయడానికి వాడింది. దీంతో సుధీర్ ఎలిమినేషన్ క్యాన్సిల్ అయి సేఫ్ అయ్యాడు. త్రిగుణ్ కెప్టెన్ అయిన తర్వాత హౌస్ లో కంటెస్టెంట్స్ ఎలా ఉంటారో చూడాలి మరి.





