.webp)
బిగ్ బాస్ తెలుగు 10 లో ఊహించని ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. ఏడో వారం కంటెస్టెంట్స్ కి బిగ్ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పక్కా అని నిన్నటి గేమ్ లో తెలిసిపోయింది.హౌస్ లో ప్రస్తుతం పదిహేడు మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. మొత్తం పదిహేను వారాల సీజన్ లో ఆరు వారాలు అయిపోయింది. ఫినాలేకి టాప్ 5 ని తీసేస్తే మిగిలేది 12 మంది. మిగిలింది 7 వారాలే కాబట్టి లెక్క సరిపోవాలంటే ఈ వారం నుంచి డబుల్ ఎలిమినేషన్స్ తప్పవని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఏకంగా 12 మందిని నామినేషన్స్ లోకి నెట్టారు.ఈ వారం రోహిత్, త్రిగుణ్, రామకృష్ణ, అమన్, ఝాన్సీ, వర్షిణి, సుధీర్, వంశీ, శివకుమార్, దక్షి గుత్తికొండ, శ్వేత, నీతూ నటరాజ్ మొత్తంగా పన్నెండు మంది నామినేషన్స్ లో ఉన్నారు.
నిన్నటి ఎపిసోడ్ లో రెడ్ బాక్స్ నుండి ఎల్లో బాక్స్ కి వెళ్ళడానికి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. అందులో ఎవరు చివరి వరకు రెడ్ బాక్స్ లో ఉంటారో వారు మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇక గ్రీన్ బాక్స్ లో ఉన్నవారు ఎలిమినేషన్ నుండి కూడా సేవ్ అవుతారని బిగ్ బాస్ చెప్పాడు. నిన్నటి గేమ్ లో రామ్ ప్రసాద్ గెలిచి రెడ్ బాక్స్ నుండి ఎల్లో బాక్స్ కి వెళ్ళి మిడ్ వీక్ నుండి సేవ్ అయ్యాడు.
ఇక నామినేషన్స్ లో ఉన్నవారిలో అనధికారిక ఓటింగ్ ప్రకారం డేంజర్ జోన్ లో ఉన్నది కొత్త వైల్డ్ కార్డ్స్ నీతూ, దక్షిలే. నీతూ వచ్చినప్పటి నుంచి ఎమోషనల్ డ్రామా, రోహిత్ ఫ్యామిలీ విషయాలు బయటకు చెప్పడం..గత వీకెండ్ లో నాగార్జున వార్నింగ్ ఇవ్వడం వల్ల నెగిటివ్ అయింది. దక్షి కూడా గేమ్ లో పెద్దగా కనిపించకపోవడం.. తక్కువ ఓట్లతో బాటమ్ లో ఉండటం వల్ల డేంజర్ లో ఉంది. ప్రస్తుతం ఓటింగ్ ప్రకారం నీతూ 2.97% తో లాస్ట్ ప్లేస్ లో, దక్షి 3.42% తో ఆమె పైన ఉన్నారు. ఈ లెక్కన ఈ ఆదివారం వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ నుండి ఒకరు ఇంటికి వెళ్లడం పక్కా అని తెలుస్తోంది.






