Home

»

Tv News

Bigg Boss 10 Telugu: ఓటింగ్ లో నెంబర్ వన్ త్రిగుణ్.. డేంజర్ జోన్ లో ఉంది ఎవరంటే!

Oct 24, 2026 9:58AM

బిగ్ బాస్ తెలుగు 10 లో 7వ వారం ఓటింగ్ లో త్రిగుణ్ దూసుకెళ్తున్నాడు. లేటెస్ట్ ఆన్ లైన్ పోల్ ప్రకారం త్రిగుణ్ 26.89% ఓట్లతో (49,231 votes) మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి గట్టి పోటీగా రోహిత్ 25.48% ఓట్లతో (46,650 votes) రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఇద్దరి మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉండటంతో వారం చివరి వరకు టఫ్ ఫైట్ నడవనుంది.

మూడో స్థానంలో అమన్ 9.1% ఓట్లతో (16,661 votes) ఉన్నాడు. G.O.A.T టాస్క్ లో గెలిచి గ్రీన్ జోన్ కి వెళ్లినా అతనికి ఓటింగ్ లో మాత్రం పెద్దగా కలిసి రాలేదు. ఆ తర్వాత రామకృష్ణ 6.68% (12,231 votes), శ్వేత 4.65% (8,521 votes), వంశీ 4.51% (8,254 votes) తో మిడిల్ లో ఉన్నారు.

బాటమ్ లో ఉన్నవారి పరిస్థితి చూస్తే ఝాన్సీ 4.48%, సుధీర్ 4.42%, శివకుమార్ 4.31%, వర్షిణి 3.96% (7,253 votes) తో ఉన్నారు. అందరికంటే తక్కువగా ధక్షి 2.92% (5,343 votes) తో లాస్ట్ లో, నీతూ 2.61% (4,786 votes) తో ఉంది. ప్రస్తుత లెక్కల ప్రకారం వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నట్లే. అయితే ఇది అన్ అఫీషియల్ ఆన్ లైన్ పోల్ మాత్రమే. అసలైన ఎలిమినేషన్ హౌస్ లోపల జరిగే గ్రీన్, రెడ్ లెవెల్ టాస్కులపై ఆధారపడి ఉంటుంది. ఈ వారం రెడ్ టీమ్ లో ఉన్నవారికి మిడ్ వీక్ ఎలిమినేషన్ ముప్పు కూడా ఉంది. అయితే ఎవరు ఎలిమినేషన్ అవుతారనే క్యూరియాసిటీ అందరిలో నెలకొంది. త్రిగుణ్ ప్రతీ టాస్క్ ని తన అంచనాలతో, స్ట్రాటజీతో పర్ ఫెక్ట్ అనాలసిస్ చేస్తున్నాడు. అందుకే అతను ప్రతీ గేమ్ లో గెలుస్తున్నాడు. అతడి గెలుపుని షాలిని, రోహిత్ , అమన్ వాళ్ళు ఎంత అడ్డుకుందామని అనుకున్నా వారిని దాటుకుని ముందుకు దూసుకెళ్తున్నాడు త్రిగుణ్. అందుకే అతడికి అత్యధిక ఓటింగ్ పడుతోంది. 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com