.webp)
బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారం నామినేషన్లో 10 మంది ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్ రెండు తాళాల మీద ఆధారపడి ఉంటుందని బిగ్ బాస్ చెప్పాడు. ఒకటి ఆడియన్స్ ఓటింగ్, ఇంకోటి టాస్క్ పర్ఫామెన్స్. ఈ నేపథ్యంలో అక్టోబర్ 7 నాటి లేటెస్ట్ అనధికారిక ఓటింగ్ శాతం బయటకు వచ్చింది.
తాజా పోల్ ప్రకారం రోహిత్ నాయుడు 24% ఓట్లతో ఫస్ట్ ప్లేస్ లో దూసుకెళ్తున్నాడు. ముఖేష్ గౌడ 12% తో సెకండ్ ప్లేస్ లో, నరేష్ 10% తో థర్డ్ ప్లేస్ లో ఉన్నారు. షాలినీ 9% తో నాలుగో స్థానానికి ఎగబాకింది, త్రిగుణ్ కూడా 9% తో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్ 5 లో రోహిత్ కి భారీ లీడ్ ఉంది.
మిడిల్ జోన్ లో అమన్ 8%, చరణ్ 8%, ఝాన్సీ 8% తో సేఫ్ జోన్ లో ఉన్నారు. వీరి మధ్య ఓట్ల తేడా చాలా తక్కువగా ఉంది.. చివరి గంటల్లో మారే అవకాశం ఉంది. ఇక డేంజర్ జోన్ లో రామ్ ప్రసాద్ 6% తో, అపూర్వ 5% తో చివరి రెండు స్థానాల్లో ఉన్నారు.
అపూర్వకు అత్యంత తక్కువ ఓట్లు రావడంతో ఈ వారం ఎలిమినేషన్ గండం ఆమెపైనే ఉందని టాక్ నడుస్తోంది. ఇది అధికారిక ఓటింగ్ కాదు.. ఫ్యాన్స్ పోల్ మాత్రమే. అసలు ఫలితం వీకెండ్ లో నాగార్జున చెప్పే వరకు వేచి చూడాల్సిందే.




.webp)
.webp)
