
బిగ్ బాస్ సీజన్-10 లో కంటెస్టెంట్స్ మధ్య బరువులు భుజాల మీద మోసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఎల్లో బాక్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ భుజం మీ్ పొడవైన కర్రతో ఉండగా ఆ కర్రకి రెండు చివర్ల బిగ్ బాస్ బరువు ఎంతో చెప్పినప్పుడు అంత బరువు వేయాలి. ఇక ఇందులో బరువులు మోయలేక లేడి కంటెస్టెంట్స్ మాత్రం తల్లడిల్లారు.
కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ G.O.A.T. ఎండ్యూరెన్స్ టాస్క్. ఇందులో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎల్లో టీమ్ లో ఉన్న కంటెస్టెంట్లు గ్రీన్ జోన్ లోకి వెళ్లాలంటే భుజం మీద కర్ర పెట్టుకుని బరువులు మోయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్ కి సంచాలక్ గా శ్వేతని పెట్టాడు. రెడ్ టీమ్ లో ఉన్నవారు ఎల్లో టీమ్ వారికి వెయిట్స్ తగిలించాలి. ఈ క్రమంలోనే ఫస్ట్ టార్గెట్ గా వర్షిణి నిలిచింది. సంచాలక్ శ్వేత రామకృష్ణ (RK) ని పిలవగానే అతను ఏకంగా నాలుగు వెయిట్స్ ని ఒకేసారి వర్షిణికి తగిలించాడు. అప్పటికే సన్నగా ఉన్న వర్షిణి ఆ బరువును మోయలేక కళ్లు తిరిగి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కిందపడిపోయి ఏడ్చేసింది. హౌస్ మేట్స్ అందరూ షాక్ అయ్యారు. వెంటనే మెడికల్ టీమ్ వచ్చి ఆమెను చెక్ చేశారు. ఈ టాస్క్ ఎంత కఠినంగా ఉంటుందో ఆ సీన్ తోనే అర్థమైంది.
అయితే వర్షిణి కుప్పకూలిన తర్వాత కోపంతో RK పై ఫైర్ అయింది. "నీ సంగతి చూసుకుంటా, కావాలనే నాకే అన్ని వెయిట్స్ వేశావ్" అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇదే టాస్క్ లో శివ్ దాదాపు 32 కిలోల బరువు మోసి అందరికీ టార్గెట్ అయ్యాడు. త్రిగుణ్ ని కూడా రోహిత్, సుధీర్, షాలినీ కలిసి టార్గెట్ చేశారు. దీంతో వర్షిణి తర్వాత శివ్, త్రిగుణ్ కూడా టాస్క్ నుంచి తప్పుకున్నారు.ఈ టాస్క్ తో ఎల్లో టీమ్ ఫేట్ మొత్తం రెడ్ టీమ్ చేతిలో ఉందని క్లియర్ అయింది. ఎవరిని టార్గెట్ చేయాలి, ఎవరిని సేవ్ చేయాలి అనేది పూర్తిగా రెడ్ టీమ్ డిసైడ్ చేసింది. వర్షిణి కుప్పకూలడం హౌస్ లో ఎమోషనల్ మూమెంట్ గా మారింది. ఆమెకు సపోర్ట్ గా నీతూ, దేబ్జానీ వచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





.webp)
