Home

»

Tv News

Bigg Boss 10 Telugu: వర్షిణిని నామినేషన్ చేసి బాధపడ్డ త్రిగుణ్!

Oct 28, 2026 10:55AM

బిగ్ బాస్ సీజన్-10 ఎనిమిదో వారం నామినేషన్లు పూర్తయ్యాయి. త్రిగుణ్, వర్షిణిల డ్రామా పీక్స్ కి వెళ్ళింది. నిన్నటి నామినేషన్స్ లో వర్షిణిని నామినేట్ చేశాడు త్రిగుణ్. దానితో వర్షిణి బాధపడుతుంటే త్రిగుణ్ కూడా తెగ బాధపడిపోయాడు. రేపు వాళ్ళ ఇంటికి ఏ మొహం పెట్టుకుని వెళ్ళనని ఏడ్చాడు. ఆడపిల్లని ఇంటికి పంపించావని వాళ్ళ అమ్మ అడిగితే ఏం చెప్పనని త్రిగుణ్ అన్నాడు. నేను నా కోసం వచ్చాను, నా ఫ్యామిలీ కోసం వచ్చానని చెప్పాడు. నా పేరు జనానికి తెలియాలని వచ్చాను అని అన్నాడు. ఎవడెవడో వచ్చి నన్ను మాటలు అంటుంటే ఎందుకు పడుతున్నానని ఏడ్వడానికి చాలా కష్టపడ్డాడు. అది చూసి వంశీ, శ్వేతలు ఓదార్చారు.

త్రిగుణ్ మాటల్లో మా నాన్న, నా పెళ్ళం, నా కూతురు ఈ ముగ్గురు కోసమే వచ్చాను అని అన్నాడు. ఇది వింటే ఎవరికైనా ఎమోషనల్ అనిపిస్తుంది. కానీ ఇది గేమ్ అని అందరికీ తెలుసు. త్రిగుణ్ ఓ పక్క బాధపడుతుంటే వర్షిణి మరో పక్క బాధపడింది. ఇద్దరూ కలిసి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. వర్షిణి త్రిగుణ్ తో నిజంగా నువ్వేనా అని అడిగింది. నాకు తెలిసిన త్రిగుణ్ ఇదేనా అని ప్రశ్నించింది. ఇదేనా నువ్వు అంటూ ఎమోషనల్ డైలాగులు వేసింది. అది చూసి హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యారు.

త్రిగుణ్ కూడా తగ్గలేదు, ఇది గేమ్ వర్షిణి అని అన్నాడు. నా మనసులో ఏముందో నేను నీకు తప్ప ఎవరికి చెప్తాను అని అన్నాడు. దానికి వర్షిణి నాకు అవసరం లేదు అని అంది. నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు అని అంది. నీ నామినేషన్స్ ని నేను యాక్సెప్ట్ చేశానని అంది. దాన్ని వదిలేశానని చెప్పింది. నన్ను నామినేట్ చేయడం నాకు ఇబ్బంది లేదు కానీ ఇది నువ్వేనా అంటూ మళ్ళీ మొదలు పెట్టింది. వర్షిణి మాత్రం చావదొబ్బుడు ఆపలేదు. నువ్వే నన్ను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారని అంది.నామినేట్ చేసినందుకు బాధ లేదంటూనే తెగ బాధపడిపోయింది వర్షిణి.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com