Home

»

Tv News

Bigg Boss 10 Telugu Nominations: కాళ్లు మొక్కినందుకు నామినేషన్..రామకృష్ణపై ఫైర్ అయిన ఝాన్సీ!

Oct 20, 2026 1:03PM

బిగ్ బాస్ హౌస్ లో ఏడోవారం నామినేషన్స్ ప్రక్రియ షురూ అయ్యింది. మొదటగా ఝాన్సీకి ఒకర్ని నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. ఝాన్సీ ఎప్పటిలాగే చాలా సేఫ్ గా రామకృష్ణని నామినేట్ చేసింది. షాలిని కాళ్లపై పడటం నాకు నచ్చలేదని కారణం చెప్పింది.

దానికి రామకృష్ణ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు. నేను షాలినిని అనుకోకుండా తోసేశాను. ఆమె బాధపడింది.. క్షమించమని అడగడం తప్పా అని ప్రశ్నించాడు. ఎవరు ఏమనుకున్నా నాకు పర్లేదు, కాళ్లు మొక్కడం తప్పు ఎలా అవుతుందని నిలదీశాడు. దానికి నామినేషన్ కి సంబంధం ఏంటని కూడా అడిగాడు.

వీళ్ల నామినేషన్స్ మధ్యలోకి త్రిగుణ్ దూరి ఈమె కాళ్లు మొక్కినందుకు నామినేట్ చేస్తుందా.. లేదంటే వేరే వాళ్ల కాళ్ల కింద రాడ్ లు తీసినందుకు నామినేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నాడు. దాంతో రోహిత్ కల్పించుకుని తోసినందుకు ఆమె భయపడింది. ఆమె సెటిల్ అయ్యే టైమ్ కూడా ఇవ్వకుండానే సారీ సారీ అంటూ కాళ్లపై పడిపోవడంతో ఇంకా భయపడిపోయిందంటూ కవర్ చేసే ప్రయత్నం చేశాడు.

అయితే రామకృష్ణ ఊరుకోలేదు. మొన్న ముఖేష్ అన్న ఏదో అన్నారని మాట్లాడలేదని నువ్వెందుకు ఏడ్చావ్..బోరుబోరున ఎందుకు ఏడ్చావో చెప్పూ.. అది ఎమోషన్ కాదా అది డ్రామా కాదా అని ఝాన్సీని నిలదీశాడు. నువ్వు ఇలా నన్ను ఇమిటేట్ చేయడం కరెక్ట్ కాదు. అది నా ఎమోషన్ అని ఝాన్సీ అంటే అది నీ ఎమోషన్ అయితే ఇది నా ఎమోషన్ అంటూ ఇచ్చిపడేశాడు ఆర్కే.

 

 

[Bigg Boss 10 Telugu Today Nominations, Jhansi Nominates Ramakrishna, Ramakrishna Shalini Legs Issue, Trigun Entry]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com