Home

»

Tv News

 స్టార్ ప్లేయర్ రామ్ ప్రసాద్.. దక్షికి రెండు వారాలు డైరెక్ట్ నామినేషన్!

Oct 19, 2026 3:59PM

 స్టార్ ప్లేయర్ రామ్ ప్రసాద్.. దక్షికి రెండు వారాలు డైరెక్ట్ నామినేషన్!

బిగ్ బాస్ సీజన్-10 తెలుగు రోజుకో ట్విస్ట్ తో ముందుకు సాగుతోంది. ఏది, ఎప్పుడు , ఎలా జరుగుతుందో అర్థం కానట్టుగా కంటెస్టెంట్స్ హౌస్ లో ఉంటున్నారు. ఎందుకంటే నిన్నటి దాకా బాగా పర్ఫామెన్స్ ఇచ్చన షాలిని ఎలిమినేషన్ అనగానే అందరు షాక్ అయ్యారు. రోహిత్ అయితే ఏడ్చేశాడు. 

నిన్నటి ఎపిసోడ్ (అక్టోబర్ 18) లో నాగార్జున వచ్చీ రాగానే స్టెప్పులు వేశాడు. ఆ తర్వాత కంటెస్టెంట్స్ తో  డ్యాన్స్ ఫేస్ ఆఫ్ చేపించాడు‌. అందులో నరేష్ టీం విన్ అయింది. దేబ్జానీ దక్షి, త్రిగుణ్ శివ్, అమన్ ముకేష్ ఇలా అందరూ డ్యాన్స్ బాగానే వేస్తారు. ఈ డ్యాన్స్ పర్ఫామెన్స్‌లకు రాం ప్రసాద్ మార్కులు వేస్తూ ఉంటే.. నాగార్జున ఫైనల్ మార్కులు వేస్తుంటాడు. ఇందులో భాగంగా నీతూ, షాలినీ స్టెప్పులు వేస్తే రోహిత్‌ని అడుగుతాడు నాగార్జున. నీతూ మాస్టర్ బాగా చేశారని రోహిత్ అంటాడు. అవునని నాగార్జున చెప్తాడు. ఇక ఈ డ్యాన్స్ టాస్కులో అమన్ మంచిగా స్టెప్పులు వేసి అందరిని ఆకట్టుకుంటాడు. చివరకు నరేష్ టీం విన్ అవుతుంది. తర్వాత వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల మీద ఓజీ కంటెస్టెంట్ల అభిప్రాయాన్ని చెప్పమని నాగార్జున అంటాడు. అయితే ఇందులో దక్షి మీద ఎక్కువ మంది కామెంట్ చేస్తారు. ఓ మిర్చి ఇచ్చి.. కారణాన్ని చెప్పాలని నాగార్జున తెలిపాడు. దీంతో ఓజీ కంటెస్టెంట్లు ఎక్కువగా దక్షి పేరు చెప్తారు. దీంతో దక్షికి ఓ పనిష్మెంట్ ఇస్తారు. నేరుగా రెండు వారాలు నామినేట్ అవుతుందని నాగార్జున చెప్పాడు. ఆ తర్వాత స్టార్ ప్లేయర్‌గా మెజార్టీ ఓట్లతో రామ్ ప్రసాద్ నిలుస్తాడు.

గేమ్స్ అన్నీ అయిపోయాక ఎలిమినేషన్ అయింది. అయితే దక్షి మరో రెండు వారాలు నామినేషన్లో ఉండగా, రామ్ ప్రసాద్ స్టార్ ప్లేయర్ అన్నమాట.  రామ్ ప్రసాద్ కి మెజారిటీ ఓటింగ్ వచ్చింది. హౌస్ లో ఎక్కువ సపోర్ట్ ఉన్న వ్యక్తిగా రామ్ ప్రసాద్ నిలిచాడు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com