Home

»

Tv News

Bigg Boss 10 Telugu 6th week Nominations: చరణ్ ని వెన్నుపోటు పొడిచిన రోహిత్.. నరేశ్ సెన్సేషనల్ నామినేషన్!

Oct 14, 2026 10:32AM

బిగ్ బాస్ సీజన్-10 తెలుగు ఆరోవారం నామినేషన్స్ తో హీటెక్కింది. నిన్నటి నామినేషన్స్ లో నరేశ్ చేసిన నామినేషన్ వ్యాలిడ్ అనిపించింది. ఇంకా హౌస్ అంతా అతనికి సపోర్ట్ గా నిలిచారు. అసలేం జరిగిందో చూద్దాం. రోహిత్ ని నరేశ్ నామినేట్ చేశాడు‌.  లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేస్తున్నప్పుడు.. చరణ్‌తో కంపేర్ చేస్తే నువ్వు ఆడిందేం లేదని అన్నారు. నిజానికి నేను గేమ్స్ ఆడాను. ఆడి ఉండకపోతే మ్యాజిక్ 'కీ' గెలిచేవాడ్ని కాదు. కర్చీఫ్ గేమ్ ఫైనల్ వరకూ రాను. మొన్నటి గేమ్ కూడా గెలచేవాడ్ని కాదు. నామినేషన్స్ టాస్క్ అప్పుడు కూడా గెలిచింది నేనే. ఇవన్నీ గెలిచాను.. ఆడాను కాబట్టే ఇక్కడున్నానని రోహిత్ తో నరేష్ అన్నాడు. దాంతో విజల్స్ వేశాడు ముఖేష్ గౌడ. 

చరణ్ నామినేషన్ అప్పుడు మీరంతా కలిసి చరణ్‌ని టార్గెట్ చేశారు. చరణ్‌ని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు. డిస్కరేజ్ మాత్రం చేయొద్దని అన్నావు. కానీ ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలంటే మీరు చరణ్‌ని కాదని షాలిని పేరు సెలెక్ట్ చేశారు. ఎంకరేజ్ చేయమన్న మీరే చరణ్‌ని కాదని షాలినికి సపోర్ట్ చేశారు. అతను ఎలిమినేట్ అయిపోయాడు. అదేంటీ ఎంకరేజ్ చేయమని చెప్పిన మీరే చేయకపోవడం ఏంటని రోహిత్ ని నరేశ్ అడగడంతో హౌస్‌లో చప్పట్ల మోత మోగింది. రోహిత్ మొహం మాడిపోయింది. పాపం చరణ్‌కి ఒకటే ఓటు వచ్చింది.. అది రోహిత్ ఓటు వేసి ఉంటాడేమో అనుకున్నా కానీ చరణ్‌కి సపోర్ట్‌గా ఓటు వేసింది అమన్. మీ వాడని చెప్పావ్.. అతనికి సపోర్ట్ చేయాలని నీకే లేదు.. మరి నామినేషన్ వేసేవాళ్లం మాకెందుకు ఉంటుందని నరేష్ వ్యాలిడ్ పాయింట్ చెప్పాడు.

అతనికి రెండో లైఫ్ వచ్చింది కాబట్టి పుష్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. షాలిని మొదటి నుంచి హౌస్‌లో ఉంది కాబట్టి ఆమెకి సపోర్ట్ చేయడమే న్యాయం అనిపించింది. అందుకే షాలినికి సపోర్ట్ చేశా.. చరణ్ హౌస్‌లో మొదటి నుంచి ఉండి ఉంటే అతనికే సపోర్ట్ చేసేవాడ్ని అని రోహిత్ కవర్ చేసుకున్నాడు. నువ్వు షాలిని-చరణ్‌లను ఎలాగైతే కంపేర్ చేశావో.. నేను 13 మందితో కంపేర్ చేసి నేను చరణ్‌కి ఓటు వేశా.. నీకు షాలిని బెస్ట్ అనిపించింది కాబట్టి.. నువ్వు ఓటు వేశావ్ అంతే కదా అని నరేశ్ అడిగాడు. దానికి సరైన సమాధానం ఇవ్వలేకపోయాడు రోహిత్.

చివరిగా వంశీ, వర్షిణి, అమన్, రోహిత్, షాలినిలు నామినేట్ అయ్యారని బిగ్ బాస్ చెప్పాడు. నామినేషన్స్‌ చేయడానికి అర్హత సాధించలేకపోయిన రామ్ ప్రసాద్, ఝాన్సీలలో ఒకర్ని నేరుగా నామినేట్ చేసే అవకాశాన్ని కెప్టెన్ సుధీర్‌కి ఇచ్చారు బిగ్ బాస్. దాంతో రామ్ ప్రసాద్‌ని నామినేట్ చేశాడు సుధీర్. ఇక ఈ వారం రామ్ ప్రసాద్, అమన్, రోహిత్, షాలిని, వంశీ, వర్షిణి ఆరుగురు నామినేట్ అయ్యారు. చివర్లో రామ్ ప్రసాద్, నరేష్‌ల కామెడీ మామూలుగా లేదు. నరేష్‌ని ఆ బురదలోకి లాగి.. బురద స్నానం చేయించాడు రామ్ ప్రసాద్. ఆ బురదలో నరేష్‌ని దొర్లించేశాడు. ఇదంతా ఫుల్ ఫన్ గా సాగింది. మిగతా కంటెస్టెంట్స్ ఈ కామెడీని ఎంజాయ్ చేశారు. 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com