.webp)
బిగ్ బాస్ తెలుగు 10 నుండి డబుల్ ఎలిమినేషన్ లో బయటకు వచ్చిన చరణ్ మహాదేవ్ తన ఎలిమినేషన్ పై స్పందించాడు. ఐదో వారంలో అపూర్వతో పాటు చరణ్ కూడా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ తన ఎలిమినేషన్ రెండు సార్లూ హౌస్ మేట్స్ ఓటింగ్ తోనే జరిగిందని చెప్పాడు. ప్రేక్షకుల ఓట్లతో రెండు సార్లూ ఇంట్లోకి వచ్చాను, కానీ హౌస్ మేట్స్ నిర్ణయం వల్ల బయటకు వచ్చానని ఆవేదన వ్యక్తం చేశాడు. అగ్నిపరీక్ష నుంచి మొదలైన తన జర్నీకి ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమకు థాంక్స్ చెప్పాడు.
డే వన్ ఆడిషన్స్ నుంచి తనను ఆదరించారని, వారి గుండెల్లో తనకు ప్రత్యేక స్థానం ఉందని అన్నాడు. ఈ వారం నామినేషన్లు, టాస్క్ లలో తాను బాగానే మెరుగుపడ్డానని, అయినా ఎలిమినేట్ చేయడం బాధగా ఉందని అన్నాడు.హౌస్ లో కామన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ గ్రూపిజం డెఫినెట్ గా ఉందని చరణ్ బయటపెట్టాడు. వారం అంతా కలిసి ఉన్నా, ఓటింగ్ విషయానికి వచ్చేసరికి సెలబ్రిటీలు తమ వారికే, కామన్స్ తమ వారికే ఓటు వేసుకుంటారని చెప్పాడు. కెప్టెన్సీ సమయంలో ఇది స్పష్టంగా కనిపించిందని అన్నాడు.
షాలిని, రోహిత్ బంధం గురించి అడగగా అది వారి వ్యక్తిగత విషయం, నేను జోక్యం చేసుకోను అని చెప్పాడు. షాలినిని ఉంచితే రోహిత్ ఇండివిడ్యువల్ గేమ్ దెబ్బతింటుందని భావించి హౌస్ మేట్స్ అలా ఓటు వేశారని తన అభిప్రాయం చెప్పాడు. చివరగా నేను చరణ్ లాగే ఆడాను, అనవసర గొడవలు, డ్రామాల జోలికి పోలేదు, నా జెన్యూనిటీని నిలుపుకున్నానని చెప్పాడు.నాగార్జున హౌస్ మేట్స్ ని ఓటు వేయమనగా 11 ఓట్లలో షాలినికి 10 ఓట్లు, చరణ్ కి కేవలం అమన్ ఒక్కడే ఓటు వేయడంతో చరణ్ రెండో సారి ఎలిమినేట్ అయ్యాడు.






