
బిగ్ బాస్ సీజన్-10 సండే ఎపిసోడ్ కేవలం ఎలిమినేషన్ తోనే కాకుండా సినిమా ప్రమోషన్, ఎమోషనల్ మూమెంట్స్ తో కూడా ఆసక్తిగా సాగింది. స్టేజ్ మీదకు మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, సారా, కార్తికేయ వచ్చి తమ కొత్త సినిమా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ట్రైలర్ ను చూపించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులను రెండు టీమ్స్ గా డివైడ్ చేసాడు నాగార్జున. సూరి టీమ్ (ఫహాద్) మరియు దివ్య టీమ్ గా విడగొట్టి ఫన్ గేమ్ ఆడించారు. ఈ గేమ్ లో నరేష్ అందరికంటే చురుగ్గా ఉంటూ గంట కొట్టి అన్ని ప్రశ్నలకు కరెక్ట్ గా సమాధానాలు చెప్పాడు. దీంతో సూరి టీమ్ విన్ అయింది. ఈ టాస్క్ తో ఇంట్లో కాస్త ఫన్ మూడ్ వచ్చింది.
అయితే ఆ ఫన్ మూడ్ ఎక్కువసేపు నిలవలేదు. 15 లక్షల సూట్ కేస్ తో మిథిలేష్ వెళ్లిపోవడంపై ఇంట్లో రెండు వర్గాలుగా విడిపోయి వాదించుకున్నారు. త్రిగుణ్, ముఖేష్ లు ఇది అన్యాయం అని వాదిస్తుంటే, మిగిలిన వారు అది అతని వ్యక్తిగత నిర్ణయమని అన్నారు. ముఖ్యంగా అమన్ ని టార్గెట్ చేస్తూ త్రిగుణ్, ముఖేష్ గట్టిగా అరవడంతో ఇంటి వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. మధ్యలో వంశీ సర్ది చెప్పడానికి వస్తే అతనిపై కూడా అరిచారు. చివరకు అమన్ తగ్గి వంశీకి సారీ చెప్పడంతో గొడవ ఆగింది. ఈ గొడవతో ఇంట్లో ఎవరు ఎవరి సైడ్ ఉన్నారో క్లియర్ గా అర్థమైంది. గొడవల తర్వాత నాగార్జున ఇంటి సభ్యుల మధ్య ఉన్న నెగెటివిటీని బయటకు తీయడానికి మెడల్స్ టాస్క్ పెట్టాడు. ఈ టాస్క్ తో ఇంట్లో ఎవరి మీద ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉందో ప్రేక్షకులకు క్లియర్ గా తెలిసిపోయింది.
ఎపిసోడ్ చివర్లో ఎమోషనల్ సీన్ కూడా చోటు చేసుకుంది. సేఫ్ అయిన కంటెస్టెంట్స్ ను ప్రకటిస్తున్న సమయంలో నాగార్జున రోహిత్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. నీకు మేనల్లుడు పుట్టాని నాగార్జున అనడంతో రోహిత్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంటి సభ్యులందరూ అతన్ని అభినందించారు. ఆ తర్వాత వంశీ, వర్షిణిలలో ఒకరిని కాపాడటానికి ముఖేష్ తన కెప్టెన్సీని త్యాగం చేయడం మరో ఎమోషనల్ మూమెంట్ గా మారింది. నాగ్ అపూర్వను కొత్త కెప్టెన్ గా ప్రకటించడంతో ఎపిసోడ్ ముగిసింది. మొత్తంగా ఫైట్స్, ఫన్, ఎమోషన్ తో సండే ఎపిసోడ్ ఫుల్ ప్యాకేజ్ లా సాగింది.






