.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 సండే ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సాగింది. నాగార్జున హౌస్ మేట్స్ తో రెండు ఫన్ టాస్క్ లు ఆడించారు. మొదటగా హీరో, హీరోయిన్లకు సంబంధించిన ప్రాపర్టీలను చూపించి సినిమా పేరు గెస్ చేయమన్నారు. ఈ టాస్క్ మధ్యలోనే ముఖేష్, దేబ్జానీ, నరేష్, చరణ్, త్రిగుణ్ సేఫ్ అయినట్లు ప్రకటించారు.
తర్వాత ఏషియన్ పెయింట్స్ MD వచ్చి ప్రమోషనల్ యాడ్ చేశారు. ఆ తర్వాత ఝాన్సీ, అపూర్వలో బెస్ట్ కెప్టెన్ ఎవరు అని షాలినీని నాగ్ అడగగా అపూర్వ అని చెప్పింది. ఆ తర్వాత నాగ్ పెట్టిన చాక్లెట్ టాస్క్ లో గర్ల్స్ టీమ్ విన్ అయింది. రెండు టీమ్స్ నుంచి ఇద్దరు చొప్పున వచ్చి నాలుగు సమాధానాలు చెప్తే, నాగ్ సమాధానంతో మ్యాచ్ అయిన వారికి చాక్లెట్ ఇస్తానన్నారు.
మెజార్టీ ఓట్ల ప్రకారం ఈ వారం స్టార్ ప్లేయర్ గా ఝాన్సీ నిలిచింది. ఆ తర్వాత పడవ టాస్క్ పెట్టారు. ఐదు గ్రూపులుగా విడిపోయి ఒకరిని కెప్టెన్ గా పెట్టుకోవాలన్నారు. ఎవరిని ముంచుతారు, ఎవరిని కాపాడతారు అని కెప్టెన్లను అడిగారు. అందులో ఝాన్సీ ముఖేష్ కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో షూస్ ఆర్డర్ పెట్టింది. ఈ చర్చలో చరణ్ కలుగజేసుకొని "మాకు డబ్బులు కాదు సర్.. కప్పు ముఖ్యం" అన్నాడు. నీకు అయితే ఆట కూడా ముఖ్యం కాదులే.. వారానికి ఒకసారి బయటకు వెళ్లి వస్తున్నావ్.. నీకు ఆట ఎందుకు ముఖ్యం అవుతుంది లే" అంటూ సెటైర్ వేసి నోరు మూయించేశాడు. చివరకు షాలినీ సేఫ్ అయిందని, శ్రిష్టి ఎలిమినేట్ అయిందని నాగార్జున చెప్పాడు.






