Home

»

Tv News

శ్రిష్టి ఎలిమినేషన్.. ఆ ముగ్గురు మాస్క్ వేసుకున్నారంట!

Oct 5, 2026 10:00AM

బిగ్ బాస్ తెలుగు 10 నాలుగో వారం ఎలిమినేషన్ లో శ్రిష్టి ఇంటిని వీడింది. ఆదివారం ఎపిసోడ్ లో నాగార్జున శ్రిష్టి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. బయటకు వచ్చేటప్పుడు ఆమె ఎక్కడా ఏడవలేదు.. చాలా స్ట్రాంగ్ గా నవ్వుతూనే బయటకు వచ్చింది. తన జర్నీ వీడియో చూసినప్పుడు మాత్రమే కాస్త ఎమోషనల్ అయింది.

స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత నాగ్ అడిగిన ప్రశ్నలకు శ్రిష్టి షాకింగ్ ఆన్సర్లు ఇచ్చింది. ఇంట్లో ఇంకా ముగ్గురు మాస్క్ వేసుకుని ఆడుతున్నారని చెప్పింది. ఆ ముగ్గురు ఎవరంటే రామ్ ప్రసాద్, ముఖేష్, వర్షిణి అని పేర్లు కూడా బయటపెట్టింది. వాళ్ళు నిజస్వరూపం ఇంకా బయటకు రాలేదని చెప్పింది.

అందులో ముఖ్యంగా రామ్ ప్రసాద్ గురించి శ్రిష్టి మాట్లాడుతూ.. రామ్ ప్రసాద్ ఒక మాట అనేసి వెళ్లిపోతాడు.. అందరి మైండ్ లో ఆ మాటను ఇంజెక్ట్ చేస్తాడు.. అందరిని ప్రభావితం చేస్తుంటాడని అంది. దానికి నాగార్జున కూడా.. అవును మిథిలేష్ విషయంలో కూడా అలానే చేశాడు కదా? అంటూ రామ్ ప్రసాద్ తీరును తప్పుపట్టారు.

అసలు అక్కడ అతడిని ఆపాలని ఎవరికి అనిపించలేదా.. మీ డబ్బులు పోతున్నాయని అనిపించలేదా.. అని నాగ్ హౌస్ మేట్స్ ను ప్రశ్నించారు. ఈ వారం టోటల్ డామినేషన్ థీమ్ లో అమన్, రోహిత్, త్రిగుణ్ లకు ఎల్లో కార్డు వచ్చింది. వచ్చే వారం రోడ్ టు రీలోడ్ థీమ్ తో గేమ్ నడుస్తుందని నాగార్జున తెలిపారు.

 

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com