
బిగ్ బాస్ తెలుగు 10 లో నిన్నటి ఎపిసోడ్ ముగింపులో శివ్, ముఖేష్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రెడ్ , ఎల్లో, గ్రీన్ లెవెల్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. నిన్న ఎల్లో టీమ్ కంటెస్టెంట్స్ మధ్య జరిగిన టాస్క్ లో ముఖేష్ నోరుజారాడు. అతనికి తెలుగు సరిగ్గా మాట్లాడటం తెలియక సిగ్గు లేదురా నీకు అంటూ శివ్ మీద విరుచుకుపడ్డాడు ముఖేష్.
నిన్నటి G.O.A.T టాస్క్ లో భాగంగా రెడ్ టీమ్ వారు ఎల్లో టీమ్ వారికి బరువులు వేయాల్సి ఉంటుంది. శివ్ ఏకంగా ఒక సైడే 12 కిలోల బరువును ముఖేష్ కి వేశాడు. దీంతో ముఖేష్ ఫైర్ అయ్యాడు. నాకు ఎందుకు అంత బరువు వేశావ్, టార్గెట్ చేశావ్ కదా అని శివ్ ని ముఖేష్ నిలదీశాడు. దానికి శివ్ తనదైన స్టైల్ లో సమాధానమిచ్చాడు.
అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ముఖేష్ గతంలో శివ్ ని.. ఎంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగాడట. దాన్ని గుర్తు చేస్తూ.. ఇంతకు ముందు నన్ను గర్ల్ ఫ్రెండ్స్ గురించి అడిగావ్ కదా, నీ గురించి నాకు కూడా తెలుసు, నీ విషయం నాకు కూడా తెలుసంటూ ముఖేష్ కౌంటర్ ఇచ్చాడు. శివ్ బయట తన లవ్ స్టోరీ గురించి లైలా మజ్ను లా బిల్డప్ ఇస్తున్నాడని ముఖేష్ ఎద్దేవా చేశాడు.దీంతో శివ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు. తన లవ్ స్టోరీ ని కించపరిచేలా మాట్లాడవద్దని, అది తన పర్సనల్ అని శివ్ అన్నాడు. ఈ వారం రెడ్ టీమ్ లో ఉన్నవారు మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండటంతో, ఎల్లో టీమ్ నుంచి గ్రీన్ టీమ్ కి వెళ్లేందుకు అందరూ గట్టిగా పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో శివ్-ముకేష్ గొడవ హౌస్ లో మరింత హీట్ పెంచింది.
SEO Keywords :





