Home

»

Tv News

Bigg Boss 10 Telugu: సీక్రెట్ రూమ్‌లో షాలిని ఎమోషనల్.. ఆమె కోసం రోహిత్ కంటతడి!

Oct 20, 2026 12:53PM

బిగ్ బాస్ 10 తెలుగులో షాలిని ఎలిమినేషన్ తో హౌస్ మొత్తం ఎమోషనల్ గా మారింది. షాలిని ఎలిమినేట్ అయిందని తెలియగానే రోహిత్ తట్టుకోలేకపోయాడు. పెళ్లాం చచ్చినోడిలా ఏడ్చేస్తున్నాడంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నా, అతని బాధలో నిజాయితీ కనిపించింది. ఆర్కే, అమన్ లు ఊకోరా ఊకో అంటూ ఓదార్చుతూనే ఉన్నారు.

అమన్ అయితే ఏడ్వకురా నీ పెయిన్ ఎంతలా ఉంటుందో నాకు తెలుసు, షాలిని వెళ్లిపోయింది. ఇప్పటి నుంచి మనం గేమ్ లోకి దిగుదాం.. మళ్లీ పాత రోహిత్ రావాలంటూ ధైర్యం చెప్పాడు. వాళ్లదేదో జన్మ జన్మల బంధం అన్నట్టుగా మాట్లాడాడు. రోహిత్ మాత్రం షాలిని లేని లోటును ఫీల్ అవుతూ కనిపించాడు.

అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే షాలిని ఎలిమినేట్ కాలేదు, సీక్రెట్ రూమ్ లోకి వెళ్లింది. థాంక్యూ బిగ్ బాస్ థాంక్యూ సో మచ్, ఇది నాకు సెకండ్ లైఫ్ అని షాలిని ఎమోషనల్ అయింది. ఇప్పటి నుంచి గేమ్ ఇంకో లెవల్ లో ఉంటది. నేను ఎక్కడికి వెళ్లడం లేదంటూ సీక్రెట్ రూమ్ నుంచి రోహిత్ ని చూడటం స్టార్ట్ చేసింది.

షాలిని బాటిల్ ని రోహిత్ తీసుకుని దాంతోనే వాటర్ తాగడం.. ఆమె ఇయర్ రింగ్స్ ని చేత్తో పట్టుకుని బాధపడటం చూసి సీక్రెట్ రూమ్ లో ఉన్న షాలిని తెగ మురిసిపోయింది. అది నా బాటిల్ అంటూ తెగ సంబరపడింది. వీరి బాండింగ్, రోహిత్ లోని పాజిటివ్ లవ్ చూసి ఫ్యాన్స్ కూడా ఈ జంటే బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

[Bigg Boss 10 Telugu Secret Room Shalini, Rohit Shalini Love Track Positive, Shalini Second Life Bigg Boss, Rohit Emotional For Shalini]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com