Home

»

Tv News

Bigg Boss 10 Telugu 6th week Nominations : నువ్వు ఆ కప్పే సరిగ్గా కడగవ్.. ఈ కప్పు ఎందుకు ఇస్తారు: టెంపర్ వంశీ!

Oct 13, 2026 9:56AM

బిగ్ బాస్ సీజన్-10 తెలుగు ఇప్పటికే అయిదు వారాలు పూర్తి అయింది. ఇక వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ రాకతో హౌస్ లో కొత్త నీరు వచ్చినట్టుగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో నీతూ నటరాజ్, షాలినికి మధ్య గొడవ జరిగింది. నామినేషన్స్ చేయాలంటే టాస్క్ ఆడి గెలవాలని బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. దాంతో కంటెస్టెంట్స్ నువ్వా నేనా అన్నట్టుగా టాస్క్ లు ఆడారు. అయితే ఎవరెవరు టాస్క్ ఆడాలని డిసైడ్ చేసేది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అని బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.

వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్  శివ్ వచ్చి త్రిగుణ్, రోహిత్ పేర్లను తీసుకుంటారు. ఆ ఇద్దరూ టాస్కులో తలపడతారు. అందులో రోహిత్ గెలుస్తాడు. వంశీ , ఝాన్సీలను రోహిత్ నామినేట్ చేశాడు. మీ తెలివంతా ఉపయోగించి నామినేషన్స్ పాయింట్స్ ఒకరి మీద పెట్టారని రోహిత్ అంటాడు. నా తెలివి అంతా అని మీరు మాట్లాడాల్సిన పని లేదని వంశీ అంటారు. నేను ఎలా మాట్లాడాలో కూడా మీరే స్క్రిప్ట్ ఇస్తారా అని రోహిత్ అంటాడు. స్క్రిప్ట్ ఇచ్చేంత అర్హత లేదు.. నువ్వు హీరో కాదు అని వంశీ అంటాడు. మీ ఆట నాకు కనబడలేదు.. ఇంకెప్పటికి కనబడదనే అనుకుంటున్నానని రోహిత్ అంటాడు. బయటకు వెళ్లాక కనిపిస్తుందిలే అని వంశీ కౌంటర్ వేస్తాడు. నేను కప్పు తీసుకునే బయటకు వెళ్తానని రోహిత్.. నీకు ఇంట్లో ఉన్న కప్పులే కడగడం రాదని వంశీ అంటాడు. 

ఆ తర్వాత ఝాన్సీని నామినేట్ చేస్తాడు రోహిత్.  నువ్వు (ఝాన్సీ) ఇమ్యూనిటీ వద్దని అంటున్నావ్.. కెప్టెన్సీ అంటే ఏంటి.. ఇమ్యూనిటీనే కదా.. అని రోహిత్ అంటాడు. నాకు ఇమ్యూనిటీ కోసం కెప్టెన్సీ వద్దు.. ఇంటిని చూసుకోవడానికి కెప్టెన్ అవ్వాలని అనుకున్నానని ఝాన్సీ అంటుంది. నాకు జనాలు ఉన్నారు.. చూస్తున్నారు.. నా ఆట చూసి ఓటు వేస్తారని నువ్వే అన్నావ్.. అని ఝాన్సీకి రోహిత్ పాయింట్స్ చెప్తాడు. అవసరం వచ్చినప్పుడు జనాలు చూస్తారు అని.. ఒక్కసారి అంటే.. నువ్వు పది సార్లు అన్నావ్.. నువ్వే సింపతీగా ఆడుతున్నావ్ అని నేను అంటున్నా అని ఝాన్సీ కౌంటర్ వేస్తుంది. నా బిహేవియర్ త్రిగుణ్‌తో ఎందుకు మారింది.. నీతో ఎందుకు మారలేదు.. ఇంగితానికి వదిలేస్తున్నా.. అని రోహిత్ అంటాడు. నీలాంటి జ్ఞానం లేని వాళ్లు చెప్తే నేను ఎందుకు వినాలని వంశీ ఫైర్ అవుతాడు. వంశీ పాయింట్స్ వాలిడ్‌గా అనిపించాయ్ అని వంశీ నామినేట్ అవుతాడని శివ్ చెప్తాడు. 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com