.webp)
నామినేషన్స్ కు ముందే ప్లానింగ్ చేశారు కామనర్స్. బిగ్ బాస్ హౌస్ లో ప్రతీ మూలన కెమెరాలు ఉంటాయని మర్చిపోయి రూల్ ని బ్రేక్ చేశారు కామనర్స్. ఇది మరీ దారుణం.. ఇప్పటి వరకు ఏ సీజన్ లోను ఇంత ఓపెన్ గా ఒక అయిదుగురు కలిసి గ్రూప్ గా మాట్లాడుకొని నామినేషన్ చేయడం.
అసలేం జరిగిందంటే నిన్నటి అయిదో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే ముందు అగ్నిపరీక్ష టీమ్ అంతా కలిసి ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకున్నారు. కామనర్స్ అమన్, రోహిత్, అపూర్వ, చరణ్, షాలినీ కలిసి ఎవరిని నామినేషన్ చేయాలని మాట్లాడుకుంటున్నారు. మొదటగా చరణ్, షాలినీ, రోహిత్, అమన్ ఉండగా.. అప్పడే అక్కడికి అపూర్వ వస్తుంది. "ఎవరిని ఏసెద్దాం" అని రోహిత్ ని అపూర్వ అడుగుతుంది. ముందుగా వీక్లీ రీక్యాప్ చూసి ఎవరేం చేశారో డిస్కస్ చేసి, ఎవరిని ఎవరు నామినేషన్ చేయాలి.. ఏం పాయింట్లు పెట్టాలో మాట్లాడుకోవాలని రోహిత్ అందరితో చెప్తూ ఉంటాడు.
ఇక చరణ్ తన పాయింట్లు చెప్తాడు..అమన్ ఎవరిని నామినేషన్ చేయాలని అనుకుంటాడో చెప్పగా రీజన్స్ వ్యాలిడ్ గా ఉండాలని రోహిత్ అంటాడు. ఇక షాలిని, అపూర్వ తమ స్ట్రాటజీ చెప్తారు. సెలబ్రిటీ టీమ్ లో ఎవ్వరిని వదలకుండా అందరిని నామినేషన్ చేయాలని రోహిత్ అందరికి చెప్తాడు. వీళ్లు డిస్కస్ చేసుకునే వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బిగ్ బాస్ సీజన్-10, వరెస్ట్ కామనర్స్, రోహిత్ ఈజ్ ఫ్లిప్పర్, రోహిత్ ఈజ్ కన్నింగ్, దిజ్ ఈజ్ వరెస్డ్ బిహేవియర్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ రోహిత్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ వీడియో చూశాక వీళ్లు గ్రూప్ గా మాట్లాడుకుని ప్లాన్ ప్రకారం సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ గురించి ముందే మాట్లాడుకోవడం స్ట్రిక్ట్ గా నిషేధం. అయినా కూడా కామనర్స్ గ్యాంగ్ ఓపెన్ గా చర్చించుకోవడం ఇప్పుడు బిగ్ ట్విస్ట్ కి దారి తీస్తుందా అనే చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ వీళ్లకు పనిష్మెంట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.




.webp)
.webp)
