.webp)
బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్లో ఉన్న వారికి సేఫ్ అయ్యేందుకు బిగ్ బాస్ ఓ అవకాశమిచ్చాడు. ఈ ఇంట్లోకి కొత్త వాళ్లు వచ్చేందుకు రెడీగా ఉన్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలని నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లను హెచ్చరించాడు. ఎండిపోయిన చెట్టు మీద నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లు, వికసించిన చెట్టు మీద దేబ్జానీ, వంశీ, సుధీర్, వర్షిణి ఫోటోలు ఉంటాయి. ఆటలు ఆడి ఎండిపోయిన చెట్టు మీద నుంచి విరబూసిన చెట్టు మీదకు రావాల్సి ఉంటుందని బిగ్ బాస్ చెప్తాడు.
అలా అయితేనే సేఫ్ అవుతారని.. ఈ సారి ఎలిమినేషన్ రెండు తాళాల మీద ఆధారపడి ఉంటుందని, ఒకటి ఆడియన్స్ చేతిలో ఉంటే ఇంకోటి ఈ టాస్కుల చేతిలో ఉంటుందని చెప్పాడు. దీంతో ఇద్దరిద్దరూ కలిసి జట్టుగా విడిపోవాలని బిగ్ బాస్ చెప్పాడు. అమన్ వద్దకు వచ్చి కలిసి ఆడుదామని త్రిగుణ్ అంటాడు. నిన్ను రిస్క్ జోన్ లో పడేయాలని అలా అంటున్నాడని అమన్ కి బ్రెయిన్ వాష్ చేస్తాడు రోహిత్. నీకు కెప్టెన్ గా అవకాశం వచ్చి పోయింది కదా.. నీకు ఛాన్స్ ఇస్తానని త్రిగుణ్ అంటాడు.
మనం కలిసి ఆడుదామా అని రోహిత్ ని అపూర్వ అడుగుతుంది. ఆగండి అని రోహిత్ అంటాడు. ఇక అక్కడ రోహిత్, షాలినీ కలిసి ఆడాలని అనుకుంటారు. ఆ తర్వాత పెట్టిన మొదటి టాస్కులో అపూర్వ, చరణ్ జోడి గెలిచి మొదటి స్థానంలో నిలుస్తుంది. ఆపై త్రిగుణ్, అమన్, ముఖేష్, ఝాన్సీ, నరేష్, రాం ప్రసాద్ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లోకి వస్తారు. ఇక చివరగా రోహిత్ టాస్క్ ని కూడా సరిగ్గా పూర్తి చేయలేక చివరి స్థానంలోకి వచ్చేస్తాడు.
అలా షాలినీ, రోహిత్ జోడి మొదటి టాస్కులో ఓడిపోతుంది. ఇంకో వైపు నరేష్ తన సామ్రాజ్యం, రాజు అంటూ ఓ కథ చెప్పి అందరిని నవ్విస్తాడు. ఇదే ఎపిసోడ్ లో షాలినీ, అపూర్వ గొడవ జరుగుతుంటే నరేష్, వర్షిణి కలిసి టైటానిక్ స్పూఫ్ చేసి అందరినీ నవ్విస్తారు. అలా కొంత ఫన్, ఎక్కువ గొడవలతో నేటి ఎపిసోడ్ సాగింది. మరి సేఫ్ అయ్యేది ఎవరో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.




.webp)

