Home

»

Tv News

Bigg Boss 10 Telugu: నీతూ వర్సెస్ వర్షిణి.. నోరుజారిన రోహిత్, త్రిగుణ్!

Oct 20, 2026 1:27PM

బిగ్ బాస్ 10 లో నామినేషన్స్ టైమ్ లోనే అసలు రచ్చ మొదలైంది. నీతూకి ఒకర్ని నామినేట్ చేసే అధికారం ఇవ్వగా నీతూ వర్షిణిని నామినేట్ చేసింది. ఈ ఇంటికి వచ్చింది గేమ్ ఆడటానికి తప్ప జట్టు కట్టడానికి కాదు.. నువ్వు గేమ్ లో కనిపించడం లేదు.. సింగిల్ గా ఆడటం లేదని చెప్పింది.

దాంతో వర్షిణి సీరియస్ అయింది. కలిసి ఆడితే తప్పేం ఉంది.. కావాలంటే మీరు కూడా రండి కలుపుకుని ఆడదాం.. నా గేమ్ గురించి ఆలోచించేటంత నాలెడ్జ్ మీకు లేదని అంది. దాంతో ఏయ్ ఆగవమ్మా ఆగూ అంటూ వర్షిణి రెచ్చిపోగా..  ముఖేష్ ని అడ్డుపెట్టుకుని నువ్వు ఈ ఇంట్లో కొనసాగుతున్నావ్ తప్ప నువ్వేం ఆడింది లేదని నీతూ అంటుంది. మరి నువ్వేం చేస్తున్నావ్, బయట నుంచి గేమ్ చూసొచ్చి అక్కా తమ్ముడూ అంటూ ఆట ఆడటం లేదా అంటూ వర్షిణి కౌంటర్ ఇచ్చింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు మీదికి వెళ్లి పోవే అంటూ దూషించుకున్నారు.

ఆ తర్వాత రోహిత్ కి నామినేషన్ ఛాన్స్ రాగా సుధీర్ ని నామినేట్ చేశాడు. నా ఫ్యామిలీ మీద ఒట్టు, నేను ఎవరితోనూ డీల్ పెట్టుకోనని చెప్పారు కానీ మీరు డీల్ పెట్టుకుని సొంత టీమ్ కే మోసం చేయడం నాకు నచ్చలేదని కారణం చెప్పాడు. నేను ఫ్యామిలీ అన్నది ఇక్కడున్న ఫ్యామిలీ అని సుధీర్ చెప్పినా, సుధీర్ డీల్ పెట్టుకోవడం తప్పైతే మీరు చేసిందీ అదే కదా అంటూ దక్షి కూడా ఇచ్చిపడేసింది. నాకు పవర్ అక్కర్లేదు, నేనున్న చోటే పవర్  ని జనరేట్ చేసుకోగలనంటూ రోహిత్ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు.

చివర్లో రోహిత్ ని శివ్ నామినేట్ చేసి అందర్నీ స్క్రిప్ట్ స్క్రిప్ట్ అంటావ్.. స్క్రిప్ట్ అంటే మాకు దేవుడితో సమానం, గాడిద, మట్టిబుర్ర, సోది గోల అని అంటున్నావ్.. అది తప్పు అంటూ పాయింట్లు పెట్టాడు. దాంతో రోహిత్-త్రిగుణ్ మధ్య మాట మాట పెరిగింది. చెల్లి చెల్లి అని ఫేక్ రిలేషన్ పెట్టుకున్నది ఎవడని రోహిత్ అంటే నువ్వు ఆ అమ్మాయి అక్కడ చేయి పెట్టావ్ కదా అంటూ త్రిగుణ్ చేయి కింది పెట్టి చూపించాడు. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా, సిగ్గు లేదా అంటూ రోహిత్, బయటకు వెళ్లి ఉరి వేసుకుని చచ్చిపో అంటూ త్రిగుణ్ బూతులు, పర్సనల్ కామెంట్స్ తో రెచ్చిపోయారు.

 

 

[Bigg Boss 10 Telugu Nithu Vs Varshini Fight, Rohit Nominates Sudheer, Rohit Vs Trigun Ugly Fight, Siva Slams Rohit Script Issue]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com