Home

»

Tv News

Bigg Boss 10 Telugu: వర్షిణి, ఝాన్సీలను నామినేట్ చేసిన నరేష్.. కామన్ సెన్స్ లేదంటా!

Oct 28, 2026 10:51AM

బిగ్ బాస్ సీజన్-10 ఎనిమిదో వారం  నామినేషన్స్ లో జడ్జీల ప్యానెల్ లో రచ్చ జరిగింది. గోట్ లెవల్ సభ్యులు ముఖేష్, త్రిగుణ్, అమన్, దేబ్జానీ, నీతూలను జడ్జీలుగా పెట్టారు బిగ్ బాస్. ఎల్లో లెవల్ లో ఉన్న వాళ్ళలో ముగ్గురికి మాత్రమే నామినేట్ చేసే అధికారం ఇస్తానని చెప్పారు. ఆ ముగ్గురు ఎవరనేది వాళ్ళ వాదనలు, పాయింట్లను బట్టి జడ్జీలు ఫైనల్ చేస్తారని అన్నారు. పర్మినెంట్ జడ్జీ, రొటేటింగ్ జడ్జీ అంటూ వాళ్ళ మధ్యనే ఫిటింగ్ పెట్టారు. ఈ నామినేషన్స్ ఎల్లో లెవల్ వాళ్ళకి కాకుండా జడ్జీలకు అన్నట్టు సాగింది.

పర్మినెంట్ జడ్జీగా ఎవరు ఉండాలో చర్చించమని బిగ్ బాస్ చెప్పగానే త్రిగుణ్ మొదలెట్టాడు. అమన్ నేను ఫస్ట్ గోట్ అయ్యాను కాబట్టి నేనే పర్మినెంట్ జడ్జీ అని అన్నాడు. ముఖేష్ అయితే కామన్ సెన్స్ గోట్ ని నేనొక్కడ్నే కాబట్టి నేనే ఉంటానని అన్నాడు. చివరికి డిస్కషన్ అనంతరం పర్మినెంట్ జడ్జీగా నీతూని సెలెక్ట్ చేశారు. బిగ్ బాస్ వాదనల్ని బట్టి ఒకటి లేదా రెండు నామినేషన్స్ కేటాయించవచ్చని చెప్పారు. మొదటి నామినేషన్ కోసం ఎల్లో టీమ్ నుంచి నరేష్ ని ఎంపిక చేశారు జడ్జీలు. నరేష్ వచ్చి వర్షిణి, ఝాన్సీలను నామినేట్ చేశాడు. ప్రతి వారం లాగే తన పాయింట్లను గట్టిగానే పెట్టాడు. టాస్కులు సరిగ్గా ఆడటం లేదని నరేష్ అంటే వర్షిణి కౌంటర్ ఇచ్చింది. ఇది గేమ్ షో కాదు, పర్సనాలిటీ షో అని అంది. గేమ్సే ఇంపార్టెంట్ కాదని, టాస్కులు ఆడిన వాళ్లే విన్నర్లు కాలేదని వర్షిణి అంది. ఆ తర్వాత నాకు రీసెంట్ గా సర్జరీ అయ్యిందని లేదంటే ఇరగదీసేదాన్ని అని వర్షిణి అంది. 

ఈ డిస్కషన్ లో జడ్జీగా ఉన్న త్రిగుణ్ ఎవర్నైనా సాక్ష్యంగా పెట్టుకోవచ్చని అన్నాడు. దాంతో శివ్ లేచాడు. నరేష్ అంటున్నాడు టాస్కులు ఆడాలని, వర్షిణి అంటుంది ఇది పర్సనాలిటీ షో అని అన్నాడు. కానీ టాస్కులలో కూడా పర్సనాలిటీని చూపించొచ్చు అని కౌంటర్ ఇచ్చాడు శివ్. దాంతో వర్షిణి నీకు కామన్ సెన్స్ లేదు.. నువ్వు నాకు చెప్తున్నావా అని అంది. తరువాత ఝాన్సీని ఏడుస్తుందనే కారణంతో నామినేట్ చేశాడు నరేష్. ఎప్పుడూ ఏడిస్తే సింపథీ గేమ్ అని అనుకుంటారని నరేశ్ అన్నాడు. దాంతో ఝాన్సీ క్లారిటీ ఇచ్చింది.

 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com