Home

»

Tv News

 సూట్ కేస్ తీసుకుని షాకిచ్చిన మిథిలేష్.. త్రిగుణ్ వర్సెస్ అమన్ మధ్య హై వోల్టేజ్ ఫైట్!

Sep 28, 2026 10:03AM

బిగ్ బాస్ తెలుగు సీజన్-10 మూడో వారం ఎపిసోడ్ ఊహించని ట్విస్టులతో సాగింది. ఆదివారం ఎపిసోడ్‌లో మిథిలేష్‌కు బిగ్ బాస్ రూ.15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ ఇవ్వగా, అతడు ఆ మొత్తాన్ని తీసుకుని సెల్ఫ్ ఎలిమినేషన్‌కు అంగీకరించాడు. స్టేజ్‌పై నాగార్జునతో మాట్లాడుతూ ఈ డబ్బును తన పర్సనల్ సాంగ్ షూట్ కోసం ఉపయోగించుకుంటానని చెప్పాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు మాత్రం కంటెస్టెంట్లకు కీలకమైన సలహాలు ఇచ్చాడు. అమన్ రోహిత్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వంశీ త్రిగుణ్ విషయంలో, చరణ్ షాలినీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అలాగే ఎవరి గ్రూపులో చేరకుండా సొంతంగా గేమ్ ఆడాలని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.

మిథిలేష్ రూ.15 లక్షలు తీసుకుని వెళ్లడంపై ఇంట్లో మాత్రం పెద్ద చర్చ మొదలైంది. ముఖ్యంగా త్రిగుణ్, ముఖేష్ అతడి నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ డబ్బు ప్రొడక్షన్‌ నుంచి అదనంగా ఇచ్చేది కాదని, విజేతకు ఇచ్చే రూ.50 లక్షల ప్రైజ్ మనీలో నుంచే తీస్తున్నారని వారు వాదించారు. ఈ విషయంలో అమన్‌తో త్రిగుణ్‌కు వాగ్వాదం జరగడంతో పరిస్థితి వేడెక్కింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకోవడంతో గొడవ తీవ్రస్థాయికి చేరింది. మధ్యలో వంశీ అడ్డుకునేందుకు ప్రయత్నించగా, తనను ఎందుకు తోస్తున్నావంటూ అతడు కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకు పరిస్థితి మరింత ముదరకుండా అమన్ వంశీకి సారీ చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

ఆ తర్వాత నాగార్జున ఇంటి సభ్యుల అసలు అభిప్రాయాలను తెలుసుకునేందుకు మెడల్స్ టాస్క్ నిర్వహించాడు. బ్లైండ్ ఫాలోవర్, షో ఆఫ్, విష నాగు, లేజీ, కన్నింగ్, అన్నాయింగ్, ఫియర్‌లెస్ వంటి ట్యాగ్స్‌ను ఎవరికి సరిపోతాయని అనిపిస్తే వారికి ఇవ్వాలని చెప్పాడు. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. ముఖేష్ అమన్‌కు బ్లైండ్ ఫాలోవర్, రోహిత్ త్రిగుణ్‌కు కన్నింగ్, వంశీ త్రిగుణ్‌కు అన్నాయింగ్, ఝాన్సీ రోహిత్‌కు లేజీ అనే ట్యాగ్స్ ఇచ్చారు. అలాగే వర్షిణి ముఖేష్‌కు ఫియర్‌లెస్, అమన్ ముఖేష్‌కు కన్నింగ్ అనే ట్యాగ్ ఇవ్వడంతో ఇంట్లో మరోసారి ఆసక్తికరమైన చర్చ జరిగింది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com