
బిగ్ బాస్ సీజన్-10 ఎనిమిదో వారం నామినేషన్లో కంటెస్టెంట్స్ మధ్య హీటెడ్ ఆర్గుమెంట్స్ జరిగాయి. ఈ నామినేషన్ ప్రక్రియలో జడ్జీల రచ్చ మామూలుగా లేదు. పర్మినెంట్ జడ్జీగా నీతూ ఉండగా ముఖేష్ గౌడ వదలకుండా లాగుతూనే ఉన్నాడు. అతను మాట్లాడే ప్రతి పాయింట్ లో దూరిపోతున్నాడు. దాంతో త్రిగుణ్ ఆపవయ్యా సోది అంటూ గాలి తీసేశాడు. అతనొక్కడే గేమ్ ఆడుతున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అంటూ శివ పంచ్ వేశాడు. అయినా కూడా ముకేష్ వదల్లేదు, లాగుతూనే ఉన్నాడు. అతని బిహేవియర్ చూసి హౌస్ మేట్స్ కూడా విసిగిపోయారు. ఈ జడ్జీల గొడవతో నామినేషన్ ప్రక్రియ మొత్తం డిలే అయ్యింది.
ప్రస్తుతం ఉన్న పర్మినెంట్ జడ్జీ తీసుకున్న నిర్ణయంతో సంతృప్తి చెందకపోతే మిగిలిన జడ్జీలు మార్చుకోవచ్చని బిగ్ బాస్ చెప్పారు. దీంతో ముకేష్, నీతూల మధ్య డిస్కషన్ నడిచింది. నువ్వు నాకు చెప్పొద్దు అని నీతూ పెద్ద పెద్ద కళ్ళు తీసి వేలు చూపిస్తూ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దాంతో ముకేష్ నేనూ మీకంటే పెద్దగా కళ్ళు వదులుతా అని అన్నాడు. నా రియాక్షన్ కి తట్టుకోలేవ్ అని అతను కూడా వేలు చూపించి మాట్లాడాడు. ఇద్దరి మధ్య గొడవ పీక్స్ కి వెళ్ళింది. హౌస్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.నీతూ వేలు దింపు, దింపు అంటూ రెచ్చిపోయింది. ఈమె చూపించొచ్చు, అదే రియాక్షన్ అతను చూపిస్తే తట్టుకోలేకపోయింది. చేయి దింపు అంటూ నీతూ రెచ్చిపోయింది. నీకంత సీన్ లేదు కానీ ముందు మీరు దింపి మాట్లాడండి అని కౌంటర్ ఇచ్చాడు ముఖేష్. ఇద్దరి గొడవతో హౌస్ లో టెన్షన్ పెరిగింది.
చివరికి జడ్జీల రచ్చ తరువాత అమన్ ని పర్మినెంట్ జడ్జీగా ఎన్నుకున్నారు. నీతూ పర్మినెంట్ జడ్జీగా ఉండటం ముఖేష్ కి నచ్చలేదు. అందుకే అతను ఆమెతో గొడవపడ్డాడు. ఈ గొడవ తరువాత అమన్ కి పర్మినెంట్ జడ్జీ పదవి వచ్చింది. అమన్ ఫస్ట్ గోట్ అయ్యాను కాబట్టి నేనే ఉండాలని మొదటి నుంచి అంటున్నాడు. చివరికి అతని కోరిక నెరవేరింది. ఈ జడ్జీల గొడవతో నామినేషన్ ప్రక్రియ మొత్తం డిలే అయ్యింది. బిగ్ బాస్ కూడా ముఖేష్ కి క్లాస్ పీకాల్సి వచ్చింది. వినడం నేర్చుకో, అప్పుడు అర్థమవుతుందని చెప్పాడు బిగ్ బాస్.




.webp)

