Home

»

Tv News

Bigg Boss 10 Telugu Episode 20: అపూర్వ రాకతో రచ్చ.. రోహిత్ తో డ్యాన్స్, అమన్ తో ఫైట్!

Sep 26, 2026 11:32AM

బిగ్ బాస్ 10 తెలుగు ఎపిసోడ్ 20 లో అపూర్వ, మిథిలేష్ హౌస్ లోకి రావడంతోనే ఇల్లు హీటెక్కిపోయింది. ఇంట్లోని కంటెస్టెంట్లు వద్దని తక్కువ ఓట్లు వేసిన అపూర్వను.. మీ అందరికీ టెన్షన్ ఇవ్వాలని తీసుకువస్తున్నానని బిగ్ బాస్ లోపలికి పంపాడు. అపూర్వ రాగానే ముఖేష్ , రోహిత్ తో డ్యాన్స్ చేయాలని అనడంతో రోహిత్, అపూర్వ స్టెప్పులు వేశారు. ఆ సీన్ ని కిచెన్ నుంచి షాలినీ గమనిస్తూ ఉండిపోయింది. దీనిపై శ్రిష్టి, షాలినీ సుధీర్ టాపిక్ ఎలా వెళ్తుందోనని డిస్కస్ చేసుకున్నారు.

 

అపూర్వ వచ్చిన వెంటనే గొడవలు మొదలయ్యాయి. కిచెన్ లో ఎగ్స్ విషయంలో రోహిత్, అపూర్వ మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వు ఎగ్స్ తినవు కదా.. అవి మాకు ఇస్తావా అని రోహిత్ అడగ్గా బదులుగా నాకు ఏం ప్రయోజనం వస్తుందని అపూర్వ ఎదురు ప్రశ్న వేసింది. నామినేషన్ లో ఫేవర్ చేస్తారేమో అని రోహిత్ అనడంతో ఇద్దరి మధ్య మాట పెరిగింది. మరోవైపు షాలినీకి అపూర్వతో ప్రాబ్లం ఉందా అని రోహిత్, త్రిగుణ్ ప్రశ్నించారు.

 

ఇక ఇంటి పనుల విషయంలో త్రిగుణ్ కి, అమన్ కి మధ్య చిన్న గొడవ పెద్దదయింది. కెప్టెన్ చెప్తేనే వింటా, నువ్వు చెప్తే ఎందుకు వింటానని అమన్ అనడంతో త్రిగుణ్ చిరాకు పడ్డాడు. మధ్యలో రోహిత్, షాలినీ, శ్రిష్టి వచ్చి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. నా ముందు రుబాబ్ చూపించకని త్రిగుణ్ అనడంతో గొడవ మరింత పెరిగింది. చివరకు అమన్ వద్దకు త్రిగుణ్ వెళ్లి.. టెన్షన్ లో అన్నాను.. సారీ అని చెప్పడంతో గొడవ సర్దుమణిగింది.

 

అదే సమయంలో నరేష్ నిద్రపోయాడని బిగ్ బాస్ హెచ్చరించడంతో పనిష్మెంట్ గా ఝాన్సీ గుంజీలు తీయించింది. కెప్టెన్సీ కంటెండర్లను తొలగించే టాస్క్ లో అపూర్వ, మిథిలేష్ లు అమన్ ని టార్గెట్ చేశారు. అమన్ కి అటెంటివ్ నెస్ లేదు, స్క్రీన్ స్పేస్ కోసం ఫైర్ అవుతున్నాడని చెప్పారు. దీనికి అమన్.. అగ్ని పరీక్షలో నువ్వు వేస్ట్ సంచాలక్ అని అపూర్వను తిట్టడంతో హౌస్ లో మరోసారి హీట్ పెరిగింది.

 

 

 

[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Bigg Boss Telugu Episode 20, Apoorva, Mithilesh, Rohith, Shalini, Trigun, Aman, Naresh, Jhansi]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com