Home

»

Tv News

Bigg Boss 10 Telugu:  దేబ్జానీ వ్యాలిడ్ నామినేషన్.. రోహిత్, షాలినికి మైండ్ బ్లాంక్!

Oct 14, 2026 10:00AM

బిగ్ బాస్ సీజన్-10 ఆసక్తికరంగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో ఆరో వారం నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయింది ‌. మొదటిగా షాలిని.. యాంకర్ వర్షిణిని నామినేట్ చేస్తూ ఆమెకు అసలు మానవత్వమే లేదు. శ్రేష్టి పళ్లు రాలగొడతా అన్నందుకు ఈమెను చూస్తే భయం వేస్తుంది.. నెత్తిన బండరాయి వేసి చంపేస్తుందో అనిపిస్తుంది అని అన్నావ్.. అలాంటి నిన్ను చూస్తుంటే నువ్వే ఇప్పుడు చంపేస్తావేమో అని అనిపిస్తుంది. గత నామినేషన్స్‌లో ముకేష్‌ని నామినేట్ చేసే దమ్ము ఉండాలి అన్నావ్..అతన్ని నామినేట్ చేయడానికి దమ్ము ఎందుకు? మనుషుల్ని చీడ పురుగులుగా చూస్తావ్ అంటూ వర్షిణిని నామినేట్ చేసింది షాలిని. ఇఖ వర్షిణి కౌంటర్ ఇస్తుంటే.. మధ్యలోకి దూరిపోయారు త్రిగుణ్, రోహిత్‌లు. బుద్దిలేదు, జ్ణానం లేదు అంటూ ఇద్దరూ బుద్ది జ్ణానం లేని వీధి రౌడీల్లా ప్రవర్తించారు. 

 

ఆ తరువాత దేబ్జానీ..షాలినిని నామినేట్ చేస్తుంటే మన సోఫా స్టార్ రోహిత్ మధ్యలోకి మళ్లీ దూరిపోవడంతో.. ఇచ్చి పడేసింది దేబ్జానీ. నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి గుద్దడం అలవాటే కదా.. అంటూ రోహిత్‌తో క్లోజ్‌గా ఉన్న వాళ్లని వరుసగా బయటకు పంపిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది దేబ్జానీ. రెండోదిగా రాం ప్రసాద్‌ని నామినేట్ చేసి.. అతని జోక్‌లు హర్టింగ్‌గా ఉంటున్నాయని చెప్పింది. ఫైనల్‌గా దక్షి.. షాలిని నామినేషన్‌ని ఆమోదించింది. వైల్డ్ కార్డ్‌లు అంతా ఒక మాట అనుకుని వచ్చి కావాలనే నామినేట్ చేస్తున్నారు అని అన్నది షాలిని. దాంతో శివ్‌కి కోపం వచ్చింది.. మేం అంతా చూసి వచ్చాం.. ప్రతి ఒక్కరూ మీ గురించే మాట్లాడుతున్నారంటే.. మీ ఆట ఆడట్లేదని అర్థం.. ఇక్కడ కామనర్స్ లేరు.. సెలబ్రిటీలు లేరు.. అలాంటి మాటలు మాట్లాడొద్దు అని అన్నాడు శివ్. ఇక వాళ్లిద్దరూ మాట్లాడుకుంటే మళ్లీ మధ్యలోకి దూరిపోయాడు రోహిత్. 

ఆ తరువాత వంశీ.. షాలినిని నామినేట్ చేస్తూ మనుషుల్ని హీనంగా చూడొద్దు. ఇది నేషనల్ టెలివిజన్.. పదే పదే ఎఫ్ వర్డ్ మాట్లాడుతున్నావ్. నీ వల్ల హౌస్‌లో ఉన్న వాతావరణం దెబ్బ తింటుంది. బిగ్ బాస్ ఎన్నిసార్లు చెప్పినా.. హోస్ట్ సార్ ఎన్నిసార్లు చెప్పినా వినవు. అసలు నీకు మనుషులంటే పడదా? అన్నం అయిపోయిన తరువాత పది నిమిషాలు ప్లేట్ చూస్తూ కూర్చొంటున్నారు.. అంత విలువైన అన్నం పడేస్తున్నారు. ఫుడ్‌ని వేస్ట్ చేస్తున్నారని చెప్పాడు వంశీ. దాంతో షాలిని రెచ్చిపోయింది.. మింగేస్తా.. మింగేస్తా అన్నారుగా.. అయ్యయ్యో.. అయ్యయ్యో ఏ భగవాన్ అంటూ యాటిట్యూడ్ చూపించింది షాలిని. ఆ తరువాత ముకేష్‌ని నామినేట్ చేశాడు వంశీ. ఇద్దరిలో షాలినికి వాలిడ్ పాయింట్లు ఉండటంతో ఆమె నామినేషన్‌ని ఆమోదించాడు ఆర్కే. దాంతో షాలిని.. పర్సనల్‌గా వేరే ఉద్దేశం ఉండటంతో నామినేట్ చేశారని నోటికొచ్చినట్టు పేలింది షాలిని.

ఆ తరువాత త్రిగుణ్.. రోహిత్‌ని నామినేట్ చేస్తూ.. ‘నా ఫ్యామిలీ విషయాలు హౌస్‌లో మొదట మాట్లాడిందే రోహిత్. అసలు త్రిగుణ్ లేకపోతే రోహిట్ అనేటోడే లేడు’ అని అన్నాడు. ఆ తరువాత రోహిత్.. తన బిడ్డ గురించి మాట్లాడి.. సింపతీ అని అనడంతో త్రిగుణ్‌కి కోపం వచ్చింది. దయచేసి నా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడొద్దు.. ఆపెయ్.. అతన్ని ఆపు షాలిని అని రిక్వెస్ట్ చేశాడు త్రిగుణ్. ఆ తరువాత.. త్రిగుణ్ మొత్తం ఓపెన్ అయిపోయాడు. రోహిత్‌ది రొట్ట గ్యాంగ్ అని అప్పుడూ అన్నా.. ఇప్పుడూ అంటున్నా. నువ్వు చేసిన రాంగ్ గైడెన్స్ వల్లే నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్స్ వెళ్లిపోతున్నారు. అదంతా చూసిన వాళ్లకి తెలుసు’ అని అన్నాడు త్రిగుణ్.

 


 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com