
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఆరోవారం నామినేషన్స్‌తో హీటెక్కింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లకు నామినేషన్ పవర్ ఇచ్చాడు బిగ్ బాస్. సోమవారం ఎపిసోడ్లో రోహిత్ వంశీని, ముకేష్ అమన్‌ని, షాలిని దేబ్జానీని నామినేట్ చేయడంతో ఎపిసోడ్ ముగియగా, మంగళవారం నాటి ఎపిసోడ్లో మిగతా నామినేషన్స్ పూర్తయ్యాయి. వైల్డ్ కార్డ్ దక్షి ఇచ్చిన టాస్క్‌లో దేబ్జానీ గెలిచి నామినేషన్ పవర్ తెచ్చుకుని షాలినిని, రాంప్రసాద్‌ని నామినేట్ చేసింది. దక్షి షాలిని నామినేషన్‌ను ఆమోదించడంతో ఆమె లిస్ట్‌లోకి వచ్చింది. అలాగే ఆర్కే వంశీ నామినేషన్లో షాలినిని ఆమోదించడంతో ఆరోవారం నామినేషన్స్ లిస్ట్ ఫైనల్ అయింది.
ఈ ఆరోవారం నామినేషన్స్‌లో గొడవలు పీక్కు చేరాయి. మొదటగా షాలిని యాంకర్ వర్షిణిని నామినేట్ చేస్తూ నీకు మానవత్వం లేదు, మనుషుల్ని చీడ పురుగులుగా చూస్తావ్ అంటూ ఫైర్ అయింది. గతంలో శ్రేష్టి పళ్లు రాలగొడతా అన్నావ్, నీ మాటలు వింటే భయం వేస్తుంది, నెత్తిన బండరాయి వేసి చంపేస్తావేమో అనిపిస్తుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీనికి వర్షిణి కౌంటర్ ఇస్తుంటే మధ్యలోకి త్రిగుణ్, రోహిత్ దూరిపోయి వాగ్వాదాన్ని మరింత పెంచారు. ఆ తర్వాత దేబ్జానీ షాలినిని నామినేట్ చేస్తుంటే సోఫా స్టార్ రోహిత్ మళ్లీ మధ్యలోకి దూరడంతో దేబ్జానీ రెచ్చిపోయింది. నీ బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి గుద్దడం అలవాటే కదా, నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్‌ని వరుసగా బయటకు పంపిస్తున్నావ్ అంటూ రోహిత్ బయటి గేమ్‌ను బయటపెట్టింది. వైల్డ్ కార్డ్లంతా ఒక మాట మీద ఉండి కావాలనే నామినేట్ చేస్తున్నారని షాలిని అనడంతో శివ్‌కి కోపం వచ్చింది. మేం అంతా చూసి వచ్చాం, ప్రతి ఒక్కరూ మీ గురించే మాట్లాడుతున్నారంటే మీ ఆట మీరు ఆడట్లేదని అర్థం, ఇక్కడ కామనర్స్ లేరు, సెలబ్రిటీలు లేరు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
ఆ తర్వాత షాలినిని వంశీ నామినేట్ చేశాడు. రోహిత్‌ని త్రిగుణ్ నామినేట్ చేశాడు.చివరగా రోహిత్‌ది రొట్ట గ్యాంగ్, అతని రాంగ్ గైడెన్స్ వల్లే అతని ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్లిపోతున్నారని త్రిగుణ్ చెప్పాడు. మొత్తంగా ఆరోవారం నామినేషన్స్‌లో అమన్ vs త్రిగుణ్, వర్షిణి vs షాలిని, రోహిత్ vs వంశీ గొడవలతో హౌస్ హీటెక్కింది. వంశీ, అమన్, వర్షిణి, రోహిత్, షాలిని, రాంప్రసాద్ మొత్తంగా ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. వీరిలో ఎవరు సేఫ్ అవుతారో, ఎవరు డేంజర్ జోన్లో ఉంటారో వీకెండ్లో తెలుస్తుంది.






