Home

»

Tv News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ సీజన్-10 రెండో వారం కెప్టెన్ గా ముఖేష్ గౌడ, అపూర్వకి ఇమ్యూనిటీ!

Sep 26, 2026 11:23AM

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో డే 19 ఎపిసోడ్ 20..‌ఆసక్తిగా సాగింది. ఇప్పటివరకు బిగ్ బాస్ హిస్టరీలో ఒక టాస్క్ లో ఇద్దరు గెలిస్తే ఇద్దరికి ఇమ్యూనిటీ ఇవ్వడం అనేది జరగలేదు. కానీ ఈసారి బిగ్ బాస్ సరికొత్త ట్విస్ట్ ఇచ్చాడు. ముఖేష్, అపూర్వ ఒక టీమ్ గా ఆడి ఝాన్సీ, మిథిలేష్ టీమ్ పై గెలిచారు. దీంతో బిగ్ బాస్ గెలిచిన ముఖేష్ కు కెప్టెన్ బాధ్యతల్ని ఇస్తూనే అపూర్వకు కూడా ఇమ్యూనిటీని ప్రకటించాడు.

 

అగ్ని పరీక్ష నుంచి మిథిలేష్, రామకృష్ణకు సమాన ఓట్లు రావడంతో బిగ్ బాస్ టైర్ల టాస్క్ పెట్టాడు. ఆ టాస్క్ లో ఇద్దరూ భీకరంగా తలపడ్డారు.. చివరకు మిథిలేష్ గెలిచి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక హౌస్ లోకి వచ్చిన వెంటనే అపూర్వ, మిథిలేష్ లకు బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు. కెప్టెన్సీ కంటెండర్లలో నుంచి ఇద్దరిని తీసేయాలని దానికి సరైన కారణాలు చెప్పాలని ఆదేశించాడు బిగ్ బాస్.

 

దీంతో అపూర్వ, మిథిలేష్ ఇద్దరు  శ్రిష్టి పేరును ఫిక్స్ చేశారు. శ్రిష్టికి సహనం లేదని.. ఆ రోజు సుధీర్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టిందని.. చెత్త వేసి కొట్టిందని కారణం చెప్పారు. సుధీర్ కి సపోర్ట్ గా మాట్లాడటంతో వర్షిణి సూపర్ అని పొగిడింది. ఆ తర్వాత జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అపూర్వ, ముఖేష్ టీమ్ వర్సెస్ ఝాన్సీ, మిథిలేష్ టీమ్ తలపడ్డారు.

 

చివరకు ఈ టాస్క్ లో అపూర్వ, ముఖేష్ గెలవడంతో ఇద్దరికి జాక్ పాట్ తగిలింది. ముఖేష్ కు కెప్టెన్సీ, అపూర్వకు ఇమ్యూనిటీ రావడం అనేది బిగ్ బాస్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. గెలిచిన తర్వాత.. స్టార్, స్టార్ డమ్ ఊరికే రాదని చరణ్ కి ముఖేష్ కౌంటర్ వేశాడు. ముఖేష్ గెలవడంతో వర్షిణి గ్యాంగ్ ఫుల్ ఖుషీ అయింది.

 

 

 

[Bigg Boss Telugu 10, Bigg Boss Telugu Season 10, Bigg Boss Telugu Day 19, Mukesh Gowda, Apoorva, Mithilesh, Jhansi, Captaincy Task, Captain Mukesh, Immunity Apoorva]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com