(4).webp)
బిగ్ బాస్ సీజన్ 10 ఎట్టకేలకు మొదలైంది. గత కొన్ని నెలలుగా హౌస్ లోకి ఎవరు వెళ్తారనే దానిపై నెట్టింట చర్చలు జరిగాయి. మొత్తంగా హౌస్ లోకి పదహారు మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఆరుగురు కామనర్స్ కాగా పది మంది సెలెబ్రిటీలు ఉన్నారు. నిన్నటి మొదటి రోజు హౌస్ లో ఏం జరిగిందో ఓసారి చూసేద్దాం.. ఫస్ట్ దేబ్జానీ బెడ్ పై పడుకొని.. తనకు నాగార్జున ఇచ్చిన చాక్లెట్ బాక్స్ ని చూస్తూ ఎవరెవరికి ఏమేమీ ఇవ్వాలో మాట్లాడుకుంది. ఆ తర్వాత హౌస్ లో రామ్ ప్రసాద్, నరేశ్ ఒక దగ్గర ఉండి మాట్లాడుకున్నారు. ఎవరిని నామినేట్ చేయాలి.. ఎవరిని చేయకూడదు అని అనుకుంటూ ఇద్దరి మధ్య ఫన్నీ సంభాషణ సాగింది.
ఇక హౌస్ లో మొత్తం పదహారు మంది ఉంటే ఎనిమిది మందికి మాత్రమే స్పెషల్ పవర్స్ ఉన్న 'కీ' లు గెలుచుకున్నారు. ఇంకా రెండు 'కీ' లు ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారో కీ సొంతం చేసుకున్న ఎనిమిది మందిని అడిగాడు బిగ్ బాస్. దాంతో వారంతా కలిసి.. టెంపర్ వంశీ, కృష్ణుడికి ఇచ్చారు. అయితే ఈ ఎన్నుకునే క్రమంలో త్రిగుణ్ ని అందరు తప్పుపట్టారు. మీ డెసిషన్ , మీ ఒపినియన్ చెప్పండి అంతేకానీ మా అందరి డెసిషన్ లా చెప్పకండి అంటూ షాలిని, ముఖేష్ గౌడ కలిసి త్రిగుణ్ తో అన్నారు. దానికి సరే మీ ఇష్టమని తన అభిప్రాయం చెప్పాడు. ఇక మెజారిటీ మెంబర్స్ కృష్ణుడి పేరుని టెంపర్ వంశీ పేరు చెప్పడంతో వారికి 'కీ' లు లభించాయి.
ఇక 'కీ'లు లభించిన పదిమంది కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ తమకి కేటాయించిన బాక్స్ లలో ఏం ఉందో చూడమని చెప్పాడు. ఒక్కో బాక్స్ లో ఒక్కో పవర్ ఉంది.. ఒకరికి స్వాప్ చేసుకునే పవర్, ఒకరిని నామినేషన్ నుండి తప్పుకునే పవర్ మరొకటి పర్మినెంట్ గా ఏదైనా డ్యూటీ అప్పగించే పవర్, మరొకటి వోట్స్ ఆర్ డబుల్ .. అంటు ఇలా 'కీ' ఎవరి దగ్గర అయితే ఉందో వారికి కొన్ని స్పెషల్ పవర్స్ లభించాయి. వాటిని ఎప్పుడైనా వాడుకోవచ్చని బిగ్ బాస్ చెప్పాడు. ఆ తర్వాత ఆ 'కీ' లు అన్నింటిని కూడా తీసుకొచ్చి స్టోర్ రూమ్ లో పెట్టమని బిగ్ బాస్ చెప్పగా అందరు తమ 'కీ' లు ఇచ్చేశారు. మరి ఈ స్పెషల్ పవర్స్ ని ఏ కంటెస్టెంట్ ఎప్పుడు ..ఎలా వాడుకుంటారో చూడాలి మరి.





(4).webp)
