.webp)
బిగ్ బాస్ 10 తెలుగు నుంచి రెండుసార్లు ఎలిమినేట్ అయ్యాడు చరణ్ . అగ్నిపరీక్ష ద్వారా ఎంపికైన కామనర్ కంటెస్టెంట్లకు వారానికి సుమారు రూ.70 వేల వరకు పారితోషికం ఇస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అగ్నిపరీక్షలో చరణ్ కి వారానికి రూ.50,000, బిగ్ బాస్ 10 హౌస్ లో వారానికి రూ.70,000 ఇచ్చారట. అగ్నిపరీక్షలో 3 వారాలు, బిగ్ బాస్ హౌస్ లో 4 వారాలు కలిపి మొత్తంగా 7 వారాలు ఉన్నందుకు చరణ్ రూ.4,30,000 కి పైగా సంపాదించాడని తెలుస్తోంది. ఇది ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
బిగ్ బాస్ సీజన్-10 లో చరణ్ జర్నీ ఊహించని విధంగా సాగింది. ఫస్ట్ వీక్ లోనే హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత ఆడియన్స్ ఓట్ల ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి హౌస్ లోకి మళ్లీ వచ్చాడు. కానీ రీ ఎంట్రీ తర్వాత కూడా గేమ్ లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. వర్షిణి, దేబ్జానీలతో ఫ్లర్ట్, వీకెండ్ లో నాలుగు స్టెప్పులు వేయడం తప్ప పెద్దగా కంటెంట్ ఇవ్వలేదు. అన్ వర్తీ టాస్క్ లో కూడా 4 స్టాంప్ లు చరణ్ కి పడ్డాయి. దీంతో డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా వైల్డ్ కార్డ్స్ ఓటింగ్ లో 11 ఓట్లకు గాను 10 ఓట్లు షాలినీకి పడి, ఒక్క ఓటు మాత్రమే చరణ్ కి పడటంతో రెండోసారి ఎలిమినేట్ అయ్యాడు.
గేమ్ పరంగా చరణ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా రెమ్యునరేషన్ పరంగా మాత్రం భారీగానే దక్కించుకున్నాడని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మిడ్ వీక్ లో ఎలిమినేట్ కావడంతో పూర్తి వారపు పారితోషికం ఎలా లెక్కిస్తారన్నది స్పష్టంగా తెలియాల్సి ఉంది. వారానికి లెక్క కడితే దాదాపు 70 వేల వరకు, రోజులను బట్టి చూస్తే యాభై వేల వరకు అందుతాయని చెప్పొచ్చు. మొత్తంగా అగ్నిపరీక్ష, బిగ్ బాస్ జర్నీ కలిపి రూ.4.30 లక్షలకు పైగా సంపాదించాడనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక కన్ఫర్మేషన్ లేదు.





.webp)
