.webp)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఊహించని ట్విస్ట్ గా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా వచ్చిన అపూర్వ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం లీస్ట్ లో ఉండి ఎలిమినేట్ అయింది. అగ్నిపరీక్ష షో ద్వారా గుర్తింపు తెచ్చుకుని హౌస్ లోకి వచ్చిన అపూర్వ జర్నీ మూడు వారాలకే ముగిసింది.
హౌస్ లోకి వచ్చినప్పటి నుంచి అపూర్వ అరుపులు, గొడవలతోనే హైలైట్ అయింది. త్రిగుణ్, షాలినిలను టార్గెట్ చేయడం, ప్రతి చిన్న విషయానికి వాగ్వాదానికి దిగడం, ఓవర్ యాక్షన్ తో నెగెటివిటీ తెచ్చుకుంది. నాగార్జున వార్నింగ్ ఇచ్చినా బిహేవియర్ మార్చుకోలేదు. దీంతో ఓటింగ్ భారీగా తగ్గింది.
అయితే అపూర్వ ఎలిమినేషన్ తో పాటు ఆమె రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం అపూర్వకు వారానికి రూ.75 వేల చొప్పున రెమ్యునరేషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఈ లెక్కన మూడు వారాలకు సుమారు రూ.2.25 లక్షలు సంపాదించినట్టు సమాచారం. అంతకుముందు అగ్నిపరీక్ష షో నుంచి కూడా రూ.50 వేలు వచ్చాయి అంటే మొత్తంగా దాదాపు రూ.2.75 లక్షల వరకు అపూర్వ సంపాదించిందని తెలుస్తోంది. మిథిలేష్ తో పాటు వైల్డ్ కార్డ్ గా వచ్చిన మూడు వారాలు ఆడి ఎలిమినేట్ అయింది. అపూర్వ రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




.webp)

