.webp)
బిగ్ బాస్ సీజన్-10 లో మోస్ట్ వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే రోహిత్ అని నెటిజన్లు భావిస్తున్నారు. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ లో సుధీర్ ని నానా మాటలు అన్నాడు. ఆడపిల్లని యూజ్ చేసుకొని కంటెంట్ క్రియేట్ చేసే పప్పెట్ అంటూ సుధీర్ ని రోహిత్ అన్నాడు. అదే సమయంలో అతని పక్కనే ఉన్న షాలినీ రాక్షసానందం పొందుతూ నవ్వుతూ ఉంది. చరణ్ కూడా అప్పుడు అతని పక్కనే ఉన్నారు. ఇక మళ్ళీ మళ్ళీ రోహిత్ అదే అంటుంటే షాలినీ కెమెరాలున్నాయంటూ అతని నోరు మూసేసింది. లేదంటే ఇంకా చాలా అనేవాడు.
హౌస్ లో సెలెబ్రిటీ అంతా ఒక గ్రూప్ అని వాళ్ళంతా గ్రూపిజం చేస్తున్నారని ఎప్పుడు ముఖేష్ గౌడ, వర్షిణి, రామ్ ప్రసాద్, దేబ్జానీ, సుధీర్ లని రోహిత్ అంటు ఉంటాడు. అయితే నిజానికి ఇది రాంగ్.. ఎందుకంటే అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ అంతా ఎప్పుడు ఒక దగ్గరే ఉంటారు. రోహిత్ , అమన్, చరణ్, అపూర్వ, షాలినీ, శ్రిష్టి అంతా ఎప్పుడూ ఒకేదగ్గర ఉంటూ గేమ్ ప్లాన్ చేస్తారు. అయితే హౌస్ లో రెడ్ టీమ్ వర్సెస్ బ్లూ టీమ్ గేమ్ జరిగినా కూడా రోహిత్ మాత్రం మాలినీకి సపోర్ట్ గా గేమ్ ఆడాడు. ఇది పూర్తిగా రూల్స్ కి విరుద్దం. అమన్ , చరణ్, షాలినీ, అపూర్వ అంతా కలిసి రోహిత్ సలహాలను గేమ్ ప్లాన్ ని ఫాలో అవుతూ అతని కింద పప్పెట్స్ గా ఉన్నారు.
ఇక ఇన్ స్టాగ్రామ్ లో రోహిత్ ఇలా అనడం ఒక రీల్ లో పోస్ట్ చేసారు. దానికింద కామెంట్స్ మోస్ట్ వైరల్ గా మారాయి. రోహిత్ చిల్లర గాడు, వరెస్ట్ బిహేవియర్, బజనగాడు, మ్యానిపులేటర్, ఫ్లిప్పర్, నువ్వేం చేస్తున్నావురా రోహిత్ అంటూ నెటిజన్లు నానా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రోహిత్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నెగెటివిటీ రోహిత్ గేమ్ ని ఎంతవరకు దెబ్బతీస్తుందో చూడాలి.
SEO Tags:




.webp)
.webp)
