బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో ఫస్ట్ వీక్ థీమ్ మహాపరీక్ష. ఇక ఆ తర్వాత అగ్నిపరీక్ష తర్వాత మహా పరీక్ష అంటూ 10 పవర్స్ తో గేమ్ నడిపారు. ఇప్పుడు ఆ మహా పరీక్ష ముగిసింది. సెకండ్ వీక్ లోకి బిగ్ బాస్ కొత్త థీమ్ తీసుకొచ్చారు. నాగార్జున సండే ఎపిసోడ్ చివర్లో అనౌన్స్ చేశారు. ఈ వారం అంతా పవర్ ఆఫ్ పీపుల్స్ అని చెప్పారు. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ ని బిగ్ బాస్ కంట్రోల్ చేసేవారు. కానీ ఈ వారం నుంచి హౌస్ ని ఆడియన్స్ కంట్రోల్ చేస్తారు. ఇప్పటివరకు ఏ సీజన్ లో కూడా ఇలాంటిది జరగలేదు.
ప్రతీ సీజన్ లో నామినేషన్ ప్రక్రియ అనంతరం కెప్టెన్సీ టాస్క్ ఉంటుంది. కెప్టెన్ అయిన వారికి నెక్స్ట్ వీక్ ఇమ్మ్యూనిటీ ఉంటుంది కానీ ఈ సారి డిఫరెంట్ గా కెప్టెన్సీ కంటెండర్ కావాలంటే అది ఆడియన్స్ ఎవరికీ ఓట్లు వేస్తారో వాళ్ళే కెప్టెన్ కంటెండర్ అంట. ఆడియన్స్ ఏ టాస్క్ పెట్టాలి.. ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలి.. ఎవరికి లగ్జరీ ఇవ్వాలి.. ఎవరి పవర్ తీసేయాలనేది మొత్తం ఆడియన్స్ ఓటింగ్ తోనే డిసైడ్ అవుతుంది. జియో హాట్ స్టార్ యాప్ లో ప్రతీరోజూ పోల్స్ పెడతారు. ఆ పోల్స్ లో ఆడియన్స్ వేసే ఓట్ల ప్రకారం బిగ్ బాస్ టీమ్ హౌస్ లో టాస్క్ లు ఇస్తారు. దీనివల్ల హౌస్ మేట్స్ కి బయట జనం ఏం అనుకుంటున్నారో తెలుస్తుంది. ఆడియన్స్ కి నచ్చేలా ఆడకపోతే నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ లో ఇబ్బంది పడతారు. కాబట్టి సెకండ్ వీక్ లో ప్రతి కంటెస్టెంట్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు.
ఇక నిన్నటి ఆదివారం నాటి ఎపిసోడ్ లో హౌస్ లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ మిగిలారు. మిడ్ వీక్ లో చరణ్, చైత్ర రాయ్ ఎలిమినేషన్ అయ్యారు. అందుకే ఈ వీకెండ్ లో నో ఎలిమినేషన్ అని బిగ్ బాస్ డిసైడ్ చేశారు. ఇక తర్వాతి వారం పవర్ ఆఫ్ పీపుల్స్ లో ఆడియన్స్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి.
[Bigg Boss 10 power of peoples second week theme, Audience remote in Bigg Boss Telugu 10, JioHotstar voting power of peoples, Nagarjuna announces week 2 twist, Bigg Boss 10 audience decides game]




