
బిగ్ బాస్ తెలుగు సీజన్-10 లో కంటెస్టెంట్స్ మధ్య సాగుతున్న టాస్క్ లలో వారి బలం, వారి ఎమోషన్స్ బయటకి వస్తున్నాయి. రెడ్ బాక్స్ , ఎల్లో బాక్స్, గ్రీన్ బాక్స్ కోసం జరుగుతున్న టాస్క్ లలో కంటెస్టెంట్స్ తమ స్ట్రాటజీ లతో బలంతో , బుద్ధితో గేమ్స్ గెలుస్తున్నారు. అయితే కష్టపడ్డవారికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఇస్తున్న టాస్క్ G.O.A.T టాస్క్. నిన్నటి ఎపిసోడ్ లో బరువులు మోస్తూ చివరి వరకు నిలిచిన నరేష్ కన్నీరుమున్నీరయ్యాడు. అయితే నరేష్ కే G.O.A.T టైటిల్ వస్తుందని అందరూ భావించారు. ఇంటి సభ్యులంతా కూడా నరేష్ నే సపోర్ట్ చేశారు. అమన్ కి ఎక్కువ బరువు వేసి నరేష్ ని గెలిపించాలని చూశారు. కానీ బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేసింది. గేమ్ ప్రకారం నరేష్ చివరి వరకు ఉన్నా అతనికి తక్కువ బరువే వేశారు. కానీ అమన్ మాత్రం మొదటి నుంచి ఎక్కువ బరువు మోస్తూ వచ్చాడు. అందుకే ఎండ్యూరెన్స్ లెక్కల ప్రకారం అమన్ విజేత అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో నరేష్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన కష్టం వృధా అయిందని ఏడ్చేశాడు. హౌస్ మేట్స్ కూడా.. నరేష్ కి అన్యాయం జరిగిందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
దీని తర్వాత బయట కూడా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో #JusticeForNaresh హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నరేష్ చాలా కష్టపడ్డాడు.. అతనికి కూడా G.O.A.T ఇవ్వాలని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం బిగ్ బాస్ నిర్ణయం కరెక్టే, ఎక్కువ బరువు మోసిన అమన్ కే ఇవ్వాలి అంటున్నారు. ఏదేమైనా నరేష్ ఎమోషనల్ అవ్వడం ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచింది. రామ్ ప్రసాద్, ముకేష్ లాంటి వారు నరేష్ ని ఓదార్చారు. ఈ వారం నరేష్ నామినేషన్ లో ఉంటే అతనికి సింపథీ ఓట్లు గట్టిగా పడే అవకాశం ఉందని హౌస్ లోనే చర్చ నడుస్తోంది.




.webp)

